విప్రోలో తన నియామకానికి ముందు డెలాపోర్ట్ క్యాప్ జెమిని గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సిఓఓ), దాని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. క్యాప్ జెమినితో తనకి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది.
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సంస్థ కొత్త ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ)గా థియరీ డెలాపోర్ట్‌ను నియమితులయ్యారు.ఇది ఒక రిఫ్రెషింగ్ వార్త అని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అరుప్ రాయ్ అన్నారు. డెలాపోర్ట్ నియామకం విప్రోకు ఎంతో సహాయపడుతుంది, ఇది కొత్త ఆలోచనలతో సంస్థను మరింత బలోపేతం చేస్తుంది.
కంపెనీ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్న డెలాప్రొటేకు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్వాగతం పలికారు. అద్భుత నాయకత్వ లక్షణాలున్న ఆయన నేతృత్వంలో కంపెనీ మరింత అభివృద్ధిచెందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విప్రోలో తన నియామకానికి ముందు డెలాపోర్ట్ క్యాప్ జెమిని గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సిఓఓ), దాని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. క్యాప్ జెమినితో తనకి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ సిఈఓ, అల్ గ్లోబర్ సర్వీస్ హెడ్ సహా అనేక పాత్రలను పోషించారు.క్యాప్ జెమిని భారత కార్యకలాపాలను కూడా పర్యవేక్షించాడు.
also read బ్యాంక్ నిర్వాకం..ఈఎంఐ కట్టనందుకు ఏడు రేట్ల జరిమానా...
ప్రస్తుత సీఈవో, ఎండీగా ఉన్న అబిదలై నీమ్‌చావ్లా పదవీకాలం జూన్ 1తో ముగియనుంది. దీంతో కొత్త సీఈవో, ఎండీగా డెలాప్రొటేను విప్రో ఎంపికచేసింది. జూన్ 6న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో జూన్ 1 నుంచి 5వ తేదీవరకు కంపెనీ వ్యవహారాలను విప్రో లిమిటెడ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ చూడనున్నారు. విప్రో మాజీ సిఈఓ అబిదాలి జెడ్. నీముచ్వాలా విప్రోను 15 బిలియన్ డాలర్ల కంపెనీగా మార్చాలనే తన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని విఫలమయ్యాడు.
కంపెనీ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్న డెలాప్రొటేకు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్వాగతం పలికారు. విప్రోను తదుపరి దశ వృద్ధికి నడిపించడానికి డెలాప్రొటే సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. అతని ట్రాక్ రికార్డ్ చాలా అద్భుతం. అద్భుత నాయకత్వ లక్షణాలున్న ఆయన నేతృత్వంలో కంపెనీ మరింత అభివృద్ధిచెందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు
డెలాపోర్ట్ సైన్స్ పో పారిస్ నుండి ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. సార్ బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఇన్ లా పట్టా పొందాడు. అతను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన లైఫ్ ప్రాజెక్ట్ 4 యూత్ కి కో-ఫౌండర్, అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.