బ్యాంక్‌ నిర్వాకం..ఈఎంఐ కట్టనందుకు ఏడు రేట్ల జరిమానా...

By Sandra Ashok Kumar  |  First Published May 29, 2020, 2:31 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా సామాన్యులు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. తాజా సామాన్య ప్రజలకు ఈ‌ఎం‌ఐల నుండి కాస్త ఉరటనిచ్చేందుకు మారటోరియం పొడిగించిన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంభందించిన ఒక సంఘటన కర్నాటక రాష్ట్రంలోని  హుబ్లీలో చోటు చేసుకుంది. 


కర్ణాటక : కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో దేశ ఆర్ధిక రంగాన్ని చక్కబెట్టేందుకు కేంద్రం ఒక ప్రక్క ప్యాకేజీ ప్రకటించగా, మరో ప్రక్క బ్యాంకులు ఈ‌ఎం‌ఐల చెల్లింపులు మరోసారి మళ్ళీ మూడు వాయిదాను పొడిగించింది.

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా సామాన్యులు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. తాజా సామాన్య ప్రజలకు ఈ‌ఎం‌ఐల నుండి కాస్త ఉరటనిచ్చేందుకు మారటోరియం పొడిగించిన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంభందించిన ఒక సంఘటన కర్నాటక రాష్ట్రంలోని  హుబ్లీలో చోటు చేసుకుంది.

Latest Videos

ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇచ్చి కర్ణాటక బ్యాంక్‌ వినియోగదారుని నుంచి పరోక్షంగా దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి. సదురు బ్యాంక్‌ ఈఎంఐ చెల్లింపులో కాస్త జాప్యం జరిగినందుకు ఒకే నెలలో ఏడు రెట్ల జరిమానా విధించింది. ఈ‌ఎం‌ఐ కట్టనందుకు ఆ కస్టమరుకి ఏడు రెట్ల జరిమానా  విధిస్తూ నిలువునా వేధించింది.

also read ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మరో 3 నెలల పాటు మారిటోరియం పొడిగింపు!

బాధితుడు సంగమేష్‌ హడపద తెలిపిన వివరాల మేరకు లాక్ డౌన్ కారణంగా తన సెలూన్‌ షాపు బంద్‌ చేయవలసి వచ్చింది దీంతో ఈఎంఐ చెల్లించలేకపోయానన్నాడు. ఒక్క నెల ఈఎంఐ జాప్యం చేయడంతో నెలకు రూ.590లు చొప్పున బ్యాంక్‌ మొత్తం ఏడు రెట్లు రూ.4150లను వసూలు చేసిందని వాపోయాడు.

దీనిపై సంబంధిత అధికారులను వివరణ అడిగితే ఉదాసీనంగా జవాబు చెప్పారన్నారు. బజాజ్‌ ఫైనాన్స్‌లో రూ.30 వేలు రుణం తీసుకొన్న సంగమేష్‌ ప్రతి నెల రూ.3 వేలు ఈఎంఐ చెల్లించేవారు.

ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేస్తూ కేంద్రం ఆదేశాలు ఉన్నా బ్యాంకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. దీంతో బతుకు జీవనం సాగించడమే కష్టమైందని బ్యాంక్‌ మేనేజర్‌కు తన గొడును వివరించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని బాధితుడు పేర్కొన్నాడు. 
 

click me!