
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఈ టెక్నాలజీ యుగంలో మనిషి కృత్రిమ మేధస్సు పై ఆధారపడుతున్నాడు. దీంతో ఈ రంగంలో పరిశోధన చేస్తున్నటువంటి కంపెనీలకు చక్కటి భవిష్యత్తు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ రంగంలో పలు కంపెనీలు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా చూసినట్లయితే చాట్ జిపిటి అనేది గూగుల్ ను సైతం వెనక్కునట్టేలా తెరపైకి వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో గూగుల్ సంస్థ సైతం చాట్ జిపిటి దెబ్బకు వెనుకడుగు అనాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని వెనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉండటం విశేషం. పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం పైన భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా చూసినట్లయితే గూగుల్, టెస్లా మైక్రోసాఫ్ట్ , ఒరాకిల్ సహా అనేక కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో ఇప్పటికే లక్షలాది కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైపోయాయి. అందుకు తగ్గట్టుగానే ఆయా కంపెనీల ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది.
తాజాగా భారత్ లో సైతం పలు కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా రాణిస్తున్నాయి. లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ రికగ్నిషన్, మెషిన్ విజన్. AI అప్లికేషన్‌ల తయారీలో పలు సంస్థలు విజయాలను సాధించాయి. స్టాక్ మార్కెట్లో లిస్టైన కొన్ని ఏఐ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో టాప్ 5 లిస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు ఇవే.
1) Tata Elxsi Ltd.
Tata Elxsi Ltd. డిజైన్ , సాంకేతిక సహాయాన్ని అందించే సంస్థ. సిస్టమ్ ఇంటిగ్రేషన్ , సపోర్ట్ , సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ , సర్వీసెస్ అనేవి కంపెనీ నిర్వహించే రెండు విభాగాలు.ఇది సిస్టమ్ ఇంటిగ్రేషన్, సపోర్ట్ సెగ్మెంట్ కంప్యూటింగ్, బ్రాడ్‌కాస్ట్, వర్చువల్ రియాలిటీ, స్టోరేజ్ , డిజాస్టర్ రికవరీ వంటి పనులను చేస్తుంది. అలాగే భారతదేశంతో పాటు , విదేశాలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్, సపోర్ట్ కోసం పలు సర్వీసెస్ అందిస్తుంది.
2) Bosch లిమిటెడ్.
Bosch Ltd. అనేది ఎనర్జీ , బిల్డింగ్ టెక్నాలజీ, కన్స్యూమర్ గూడ్స్, ఇండస్ట్రియల్ టెక్నాలజీ , మొబిలిటీ సొల్యూషన్స్ రంగంలో సర్వీసెస్ అందిస్తోంది. ఈ అంతర్జాతీయ సంస్థ భారత స్టాక్ మార్కెట్లో సైతం లిస్టింగ్ అయి ఉంది. కంపెనీ విభాగాలలో ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ వస్తువులు, ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి.
3) Kellton Tech Solutions Ltd.
కెల్టన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది భారతదేశంలోని ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థ, ఇది ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ , ఇతర సమాచార సాంకేతిక రంగాలలో సేవలను అందిస్తుంది.
4) హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కన్సల్టింగ్ , సేవల ప్రదాత Happiest Minds Technologies Ltd. భారతదేశంలో ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ & సెక్యూరిటీ సర్వీసెస్ (IMSS), డిజిటల్ బిజినెస్ సొల్యూషన్స్ (DBS), , ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ విభాగాలలో (PES) ఉన్నాయి.
5) జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్.
Zensar Technologies Ltd. ఎలక్ట్రానిక్, సాంకేతిక రంగంలో సేవలు అందిస్తోంది. వివిధ రకాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సొల్యూషన్స్ , సేవలను అందిస్తోంది. డిజిటల్ , అప్లికేషన్ సర్వీసెస్ (DAS) , డిజిటల్ ఫౌండేషన్ సేవలు ఈ కంపెనీ రెండు ఆపరేటింగ్ విభాగాలు (DFS) కావడం విశేషం.
Disclaimer - పై పేర్కొన్నటువంటి సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే, ఏషియా నెట్ తెలుగు, ఎలాంటి స్టాక్ రికమండేషన్స్ ఇవ్వదు. పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్స్ నిపుణుల సలహా తీసుకోండి.