ఈ 225 సంవత్సరాల పురాతన చక్కెర తయారీ కంపెనీ, ఇన్వెస్టర్లకు లాభాలతో తీపి కబురు చెప్పింది...మీరు ఓ లుక్కేయండి..

Published : Feb 16, 2023, 09:00 PM IST
ఈ 225 సంవత్సరాల పురాతన చక్కెర తయారీ కంపెనీ, ఇన్వెస్టర్లకు లాభాలతో తీపి కబురు చెప్పింది...మీరు ఓ లుక్కేయండి..

సారాంశం

స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం రికవరీ ఫేజ్ నడుస్తోంది. కొన్ని స్టాక్స్ లో చక్కటి రిటర్న్స్ కనిపిస్తున్నాయి. తాజాగా దేశంలోని ఓ అగ్రశ్రేణి చక్కెర ఉత్పత్తి సంస్థ స్టాక పనితీరు గురించి తెలుసుకుందాం.

గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్లో నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి అయితే ఇప్పటికీ మార్కెట్లో ఓలటాలిటీ  సమస్య నుంచి బయటకు పడలేదు.  అయినప్పటికీ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రం చక్కటి లాభాలను అందిస్తున్నాయి అలాంటి పోస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టాక్ పంచదార ఉత్పత్తి చేసే కంపెనీ కావడం విశేషం.  నిజానికి షుగర్ స్టాక్స్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా టాప్ ఫైవ్ కంపెనీలు అయినటువంటి Shree Renuka Sugars Ltd., Triveni Engineering and Industries Ltd., EID Parry (India) Ltd., Balrampur Chini Mills Ltd., Dalmia Bharat Sugar and Industries కంపెనీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.  తాజాగా మనం EID Parry (India) Ltd  కంపెనీలో ఏడాదిగా గమనించినట్లయితే  ఈ స్టాక్  చక్కటి లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. 

EID Parry (India) Ltd ఈ రోజు మార్కెట్  ముగింపు సమయానికి  రూ. 522 వద్ద ఉంది. గురువారం, షేరు BSEలో రూ. 512 వద్ద ప్రారంభమైంది, రోజులో గరిష్టంగా రూ. 533.65 స్థాయిని తాకడం విశేషం. డిసెంబర్ 31, 2022 (Q3FY23)తో ముగిసిన మూడవ త్రైమాసికంలో, E.I.D ప్యారీ నికర లాభం 13.72% తగ్గి రూ. 18.29 కోట్ల నుండి రూ. 15.78 కోట్లకు చేరింది. మునుపటి సంవత్సరం ఇదే సమయానికి నివేదించింది. అయినప్పటికీ, కంపెనీ మొత్తం ఆదాయం 5.08% పెరిగి రూ.742.09 కోట్లకు చేరుకుంది, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి రూ.706.24 కోట్లుగా ఉంది.

సంస్థ FY23 మూడవ త్రైమాసికంలో దాని నికర లాభం రూ. 481.60 కోట్లుగా ప్రకటించింది, FY22తో పోల్చితే అదే కాలానికి రూ. 394.51 కోట్ల నుండి 22.08% పెరిగింది. ఈత్రైమాసికంలో, కంపెనీ మొత్తం ఆదాయం అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి రూ.6570.76 కోట్ల నుంచి రూ.9855.36 కోట్లకు అంటే ఏకంగా 50 శాతం పెరిగింది.

తమిళనాడులోని చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈస్ట్ ఇండియా డిస్టిలరీస్ (EID) ప్యారీ లిమిటెడ్ అనేది 225 సంవత్సరాలకు పైగా అనుభవంతో పనిచేస్తున్న ఒక భారతీయ పబ్లిక్ కార్పొరేషన్. దేశంలోని అగ్రశ్రేణి వాణిజ్య దిగ్గజాలలో ఒకటైన మురుగప్ప గ్రూప్ సంస్థకు నిలయంగా ఉంది,. 1788లో స్థాపించబడినప్పటి నుండి, "ప్యారీస్" అనే పేరుతో ఈ సంస్థ సుపరిచితం. 1842లో నెల్లికుప్పంలో భారతదేశపు మొట్టమొదటి చక్కెర కర్మాగారాన్ని స్థాపించింది.

కంపెనీ  52 వారాల స్టాక్ గరిష్ట స్థాయిని గమనిస్తే రూ. 673.30 తాకగా, 52 వారాల కనిష్ట స్థాయి విషయానికి వస్తే రూ. 386.05గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్స్ 44.55 శాతంగా ఉండగా, సంస్థాగత నాన్-ఇన్‌స్టిట్యూషనల్ హోల్డింగ్స్  వాటాలు 16.05 శాతం, 39.36 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,349.85 కోట్లుగా ఉంది.
 

Disclaimer - పై పేర్కొన్నటువంటి సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే, ఏషియా నెట్ తెలుగు, ఎలాంటి స్టాక్ రికమండేషన్స్ ఇవ్వదు. పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్స్ నిపుణుల సలహా తీసుకోండి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !