టాక్స్ చెల్లించే వారికోసం కొత్త ఆదాయపు పన్ను విధానం....

By Sandra Ashok KumarFirst Published Feb 10, 2020, 12:42 PM IST
Highlights

ఆదాయం పన్ను రిటర్న్స్(ఐటీఆర్) ఇకపై నిపుణుల సాయం అవసరం లేకుండా ఎవరి పన్నును వారే దాఖలు చేసుకునే అవకాశం లభించనున్నది.అంతేకాక తక్కువ వడ్డీ రేట్లు.. పీపీఎఫ్​, బీమా పెట్టుబడుల అవసరం లేకుండా పన్ను ప్రయోజనాలనూ క్లెయిమ్​ చేసుకోవచ్చు. ఇలా మరిన్ని సులభతర సౌకర్యాలను కల్పిస్తూ.. కేంద్రం ఇటీవలి బడ్జెట్​లో కొత్త ఆదాయం పన్ను విధానాన్ని రూపొందించింది. 

న్యూఢిల్లీ: కొత్త సరళీకృత ఆదాయపు పన్ను రేట్లను ఎంచుకునే వారికి ఐటీఆర్ దాఖలు చేయడానికి నిపుణుల‌ సేవలు అవసరం ఉండకపోవచ్చు. పన్ను చెల్లింపుదారులకు పన్ను తగ్గింపుతో సహా, కొత్త ఆదాయం పన్ను విధానం ఎంచుకోవడంతో మరో ప్రయోజనం ఉంటుంది. 

కొత్త వ్యక్తిగత ఆదాయం పన్ను విధానంతో, తక్కువ రేట్లతో పాటు, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి మీకు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా మరే ఇతర ప్రొఫెషనల్ సహాయం అవసరం లేదు. ఇదివ‌ర‌కు వివిధ మినహాయింపులు, తగ్గింపులతో ముడిప‌డి ఉన్న‌ ఆదాయం పన్ను చట్టం చాలా మంది పన్ను చెల్లింపుదారులకు వృత్తిపరమైన సహాయం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేస్తుంది.

also read నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌... సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో.. పన్ను చెల్లింపు దారులకు ఐచ్ఛికంగా కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆదాయం పన్ను చట్టాలను పాటించేందుకు ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులకు భారంగా మారింద‌ని ఆమె పేర్కొన్నారు. 

కొత్త ఆదాయ పన్ను విధానం, పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడమే కాకుండా, పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి పీపీఎఫ్, బీమా పెట్టుబ‌డులు లేన‌ప్ప‌టికీ వీలుంటుంది. మీరు తగ్గింపులు, మినహాయింపుల గ‌ణాంకాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు.
 కాబట్టి పన్నును లెక్కించడం, ఐటీఆర్ ఫారంల‌ను నింపడం కూడా సులభం అవుతుంది.

కొత్త ఆదాయం పన్ను శ్లాబురేట్లను ఎంచుకునే వారికి ముందుగా నింపిన ఐటీఆర్ లభిస్తుందని, అందువల్ల నిపుణుల సహాయం లేకుండానే రిటర్నులు దాఖలు చేయవచ్చని సీతారామన్ ప్రకటించారు.వచ్చే ఏప్రిల్ నుంచి మీరు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ మీ ఐటీఆర్‌ను దాఖలు చేసేట‌ప్పుడు, పన్ను చెల్లింపుదారులందరికీ రెండు ఆదాయం పన్ను నిబంధనలలో దేనినైనా ఎన్నుకునే అవ‌కాశం లభిస్తుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు.

also read కరోనా ఎఫెక్ట్: ముడి సరుకుకొరత..సవాళ్ల ముంగిట ఫార్మా ఇండస్ట్రీ

కొత్త ఆదాయపు పన్ను శ్లాబురేట్లను ఎంచుకునే వారికి ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఐటీఆర్ ఫారం లభిస్తుంది. అందులో చాలా వివరాలు ముందే ఉంటాయి. ఆ తర్వాత మీరు మీ రిటర్నుల‌ను సులభంగా దాఖలు చేయవచ్చన్నారు.

ఐటీ విభాగం ఇప్పటికే వచ్చే ఏడాది ఐటీఆర్-1 (సహజ్) ఫారంను విడుదల చేసింది. ఇది సంవత్సరంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వేత‌న జీవుల‌కు వ‌ర్తిస్తుంది. ఐటీఆర్-4 (సుగ‌మ్‌) వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థ‌లు (ఎల్‌ఎల్‌పీ కాకుండా) రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న‌వారు దాఖ‌లు చేయాలి.
 

click me!