నేడు భారీ పతనంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 744 పాయింట్లు డౌన్..

By S Ashok KumarFirst Published Mar 4, 2021, 11:52 AM IST
Highlights

నేడు  స్టాక్ మార్కెట్ నష్టాలతో  ప్రారంభమైంది. ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్  సెన్సెక్స్ 744.85 పాయింట్ల వద్ద అంటే 1.45 శాతం పడిపోయి 50,699.80 వద్ద ప్రారంభమైంది. 

నేడు వారంలోని నాల్గవ ట్రేడింగ్ రోజున అంటే గురువారం  స్టాక్ మార్కెట్ నష్టాలతో  ప్రారంభమైంది. ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్  సెన్సెక్స్ 744.85 పాయింట్ల వద్ద అంటే 1.45 శాతం పడిపోయి 50,699.80 వద్ద ప్రారంభమైంది.  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 218.85 పాయింట్ల వద్ద 1.44 శాతం తగ్గి 15,026.75 వద్ద ప్రారంభమైంది. 470 షేర్ల లాభపడగా 971 షేర్ల క్షీణించాయి.

 బుధవారం  అంటే నిన్న నాస్‌డాక్ ఇండెక్స్ 2.70 శాతం క్షీణించి 12,997 వద్ద ముగిసింది. డౌ జోన్స్, ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 1.39 శాతం నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నిక్కి ఇండెక్స్ 517 పాయింట్లు తగ్గి 29,042 వద్ద ట్రేడవుతోంది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 816 పాయింట్లు తగ్గి 29,064 వద్ద ట్రేడవుతోంది. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, కొరియాకు చెందిన కోస్పి, ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ ఆర్డినరీస్ ఇండెక్స్ 1.74 శాతం క్షీణించాయి.


 హెవీవెయిట్స్‌లో ఎక్కువ భాగం నేడు ప్రారంభ ట్రేడింగ్‌లో ఆర్‌ఐఎల్, ఒఎన్‌జిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల మీద  ట్రేడవుతుండగా హిండాల్కో, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్  నష్టాలతో ప్రారంభమయ్యాయి.

also read మరోసారి భారతదేశ అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ.. ప్రపంచ ధనవంతుడిగ టెస్లా సి‌ఈ‌ఓ.. ...

ఈ రోజు అన్నీ  రంగాలు కాస్త క్షీణతతో ప్రారంభమయ్యాయి. వీటిలో మెటల్, ఎఫ్‌ఎంసిజి, ఐటి, రియాల్టీ, మీడియా, బ్యాంకులు, ఫార్మా, ఫైనాన్స్ సర్వీసెస్, ఆటో, పిఎస్‌యు బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి.

ప్రీ-ఓపెన్ సమయంలో స్టాక్ మార్కెట్ 
సెన్సెక్స్ ఉదయం 9.03 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 297.74 పాయింట్లు (0.58 శాతం) తగ్గి 51,146.91 వద్ద ఉంది. నిఫ్టీ 124.80 పాయింట్లు (0.82 శాతం) తగ్గి 15,120.80 వద్ద ఉంది.


నిన్నటి ట్రేడింగ్ రోజున స్టాక్  మార్కెట్ గ్రీన్ మార్క్ మీద  అంటే లాభాలతో ప్రారంభమైంది.సెన్సెక్స్ 453.06 పాయింట్ల (0.90 శాతం) లాభంతో 50,749.95 స్థాయిలో ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 141.00 పాయింట్ల వద్ద 0.95 శాతం పెరిగి 15,060.10 వద్ద ప్రారంభమైంది. 

 స్టాక్ మార్కెట్ బుధవారం రోజున సెన్సెక్స్ 51444.65 స్థాయిలో 1147.76 పాయింట్లు  వద్ద 2.28 శాతం లాభంతో ముగిసింది.  నిఫ్టీ 326.50 పాయింట్ల వద్ద 2.19 శాతం పెరిగి 15245.60 స్థాయిలో ముగిసింది. 

click me!