హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఎస్‌బి‌ఐ మీకో గుడ్ న్యూస్ అందిస్తుంది అదేంటంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Mar 01, 2021, 06:50 PM ISTUpdated : Mar 01, 2021, 07:05 PM IST
హోమ్ లోన్  తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఎస్‌బి‌ఐ మీకో గుడ్ న్యూస్ అందిస్తుంది అదేంటంటే ?

సారాంశం

 దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గిస్తూ ప్రకటించింది.  6.70 శాతం వడ్డీ రేట్ల నుండి రుణాలు ఇస్తున్నట్లు సోమవారం తెలిపింది.  

ముంబయి, మార్చి 1: హోమ్ లోన్స్  తీసుకునేవారికి గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గిస్తూ ప్రకటించింది.  6.70 శాతం వడ్డీ రేట్ల నుండి రుణాలు ఇస్తున్నట్లు సోమవారం తెలిపింది.

కొత్త వడ్డీ రేట్లు రుణ మొత్తం ఇంకా రుణగ్రహీత సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటాయి. ఇవి 31 మార్చి 2021 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.

రూ .75 లక్షల వరకు రుణాలపై  గృహ రుణ వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి ఇంకా రూ .75 లక్షల నుంచి రూ .5 కోట్ల వరకు రుణాలపై 6.75 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది.

also read కరోనా వ్యాక్సిన్ కోసం ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొండి.. కేవలం రూ.250 చెల్లిస్తే చాలు.. ...

బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బిజినెస్) సలోని నారాయణ్ మాట్లాడుతూ, "మేము పండుగ సీజన్‌ను ముఖ్యంగా హోలీని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. ఈ ఆర్ధిక  సంవత్సరంలో చివరి నెల. ప్రాసెసింగ్ ఫీజుపై బ్యాంక్ 100 శాతం మాఫీని కూడా ఇస్తుంది " అని అన్నారు.

5 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీని పొందడానికి వినియోగదారులు యోనో యాప్ ఉపయోగించి గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేకంగా 5 బిపిఎస్  పాయింట్ల రాయితీని కూడా అందిస్తోంది.

 మేము బ్యాంకు లోపల, వెలుపల అనేక చర్యలు తీసుకుంటున్నాము. రుణగ్రహీతలు రుణాలను ఎలా తిరిగి చెల్లించవచ్చనే దానిపై ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము " అని ఆమె చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !