వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ లో లాభాల పంట

By Sandra Ashok KumarFirst Published Jan 14, 2020, 6:27 PM IST
Highlights

ఉదయం ప్రారంభంలో నామమాత్రంగా ఉన్న షేర్లు మధ్యహ్నాం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో క్లోజింగ్ వరకు అదే ఫందా కొనసాగుతుందని భావించిన ముదుపర్లకు స్వీట్ షాక్ ఇచ్చాయి స్టాక్ మార్కెట్ లాభాలు.

వరుసగా రెండో రోజు  స్టాక్ మార్కెట్ లాభాల పంట పండించింది. ఉదయం ప్రారంభంలో నామమాత్రంగా ఉన్న షేర్లు మధ్యహ్నాం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో క్లోజింగ్ వరకు అదే ఫందా కొనసాగుతుందని భావించిన ముదుపర్లకు స్వీట్ షాక్ ఇచ్చాయి స్టాక్ మార్కెట్ లాభాలు.

also read నష్టాల బాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్  ఆల్ టైమ్ గరిష్టస్థాయి 135 పాయింట్ల లాభంతో 41,952 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 12,362.30తో క్లోజ్ అయ్యాయి.టీవీ18 బ్రాడ్ కాస్ట్, టాటా గ్లోబల్, బ్లూడార్ట్, ఇండియా సిమెంట్, హిందు హెరోనాటిక్స్, టాటా ఇన్వో కార్ప్, ఏఈజీఐఎస్ లోగోస్టిక్స్, అవంతి ఫీడ్స్, జై క్రాప్, లాక్ మాచ్ వర్క్స్, బేల్ మేర్ లావేర్  షేర్లు లాభాల పాట పట్టాయి. ఎస్ బ్యాంక్, రెడింగ్ టోన్ ఇండియా, అదానీ గ్రీన్, మహీంద్రా లోగిస్, రిలయన్స్ ఇన్ఫ్రా  షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.

మార్కెట్ పై చూపని ప్రతీకూల ప్రభావాలు

ఇరాన్  - అమెరికా వైరంతో స్టాక్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాల మధ్య వైరం వల్ల స్టాక్ మార్కెట్ నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికితోడు అమెజాన్ ఫౌండర్ రాకను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న 300సిటీల్లో ఆందోళన చేయాలని ప్రయాత్నాలు చేయడం, వాహనాలు సేల్స్ భారీగా తగ్గిపోవడంపై ఆటోమొబైల్ రంగం కుదలేవుతుందని, తక్షణమే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ  రంగంపై  నిర్ణయం తీసుకోవాలని యూనియన్లు కేంద్రాన్నికోరాయి.

also read రతన్ టాటాపై 3వేల కోట్ల పరువునష్టం కేసులో కీలక మలుపు...

జీఎస్టీ తగ్గించడం వల్ల వాహనాల కొనుగోలు పెరిగే అవకాశం ఉందని సూచించాయి. అయితే ఇలాంటి అంశాలు స్టాక్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపించలేకపోయాయి.సంక్రాంతి పండుగ, పెళ్లిళ్ల సీజన్ కావడం, బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై స్టాక్ మార్కెట్ ను లాభాలు పంట పండిచాయనేది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

click me!