భారీ నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు...

By Sandra Ashok KumarFirst Published Mar 12, 2020, 12:15 PM IST
Highlights

అన్ని సెన్సెక్స్ షేర్లు  గురువారం రెడ్ కలర్లో ట్రేడవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి, టాటా స్టీల్ ఒక్కొక్కటి 10% పడిపోయాయి, టాటా స్టీల్ 9% తగ్గి నిలిచింది, తరువాత ఎస్‌బిఐ, టైటాన్, ఎం అండ్ ఎం 8%, ఎల్ అండ్ టి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 7% తగ్గాయి.

కరోనా వైరస్‌ను అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతుంది అని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన తరువాత గ్లోబల్‌ మార్కెట్ల పతనంతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. కరోనా వైరస్ స్టాక్‌మార్కెట్లను వణికిస్తోంది. బ్లాక్‌ మండే షాక్‌ నుంచి స్టాక్‌మార్కెట్లు కోలుకోకముందే గురువారం మరోసారి  స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

also read ఇండియన్ మెడిసిన్స్ కు అక్కడ ఫుల్ డిమాండ్...వాటిని కొనేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి...

అన్ని సెన్సెక్స్ షేర్లు  గురువారం రెడ్ కలర్లో ట్రేడవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి, టాటా స్టీల్ ఒక్కొక్కటి 10% పడిపోయాయి, టాటా స్టీల్ 9% తగ్గి నిలిచింది, తరువాత ఎస్‌బిఐ, టైటాన్, ఎం అండ్ ఎం 8%, ఎల్ అండ్ టి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 7% తగ్గాయి.

సెన్సెక్స్, నిఫ్టీ గురువారం దాదాపు 7% కుప్పకూలిపోయాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థ  కరోనావైరస్ మరింత వ్యాపిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ప్రపంచ ఆర్థిక మాంద్యంపై భయాలను పెంచింది.కరోనా వైరస్‌ కలకలంతో యూరప్‌ నుంచి అమెరికాకు 30 రోజుల పాటు ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తూ అమెరికా నిర్ణయించడంతో ఆసియా స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి.

also read విలాసవంతమైన బంగ్లాలు, వేల కోట్ల ప్రాపర్టీలు ఇవి రాణాకపూర్‌ ఆస్తులు...
 
 బిఎస్‌ఇ సెన్సెక్స్ 52 వారాల కనిష్టానికి చేరుకుంది, 2,707 పాయింట్లు తగ్గి 32,990.01 వద్దకు చేరుకుంది.  ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 799 పాయింట్లు పడిపోయి 9,648 కనిష్ట స్థాయికి చేరుకుంది.
 
click me!