ఎస్‌బి‌ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...మినిమం బ్యాలెన్స్ ​లేకున్నా నో ప్రాబ్లం...

By Sandra Ashok KumarFirst Published Mar 11, 2020, 6:43 PM IST
Highlights

ఎస్‌బి‌ఐ బ్యాంక్ కస్టమర్ల ఆనందం కోసం సేవింగ్స్ అకౌంట్  బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. దీంతో మొత్తం 44.51 కోట్ల ఎస్‌బిఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్  ఖాతాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ముంబయి: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సేవింగ్స్ అకౌంట్  బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. అంతే కాకుండా ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా ఎత్తివేస్తున్నట్టు  తెలిపింది. దీంతో బ్యాంక్ వినియోగదారులందరికీ గణనీయమైన ఉపశమనం కలిగించింది. అలాగే  పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది.

దేశంలో ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌  ప్రోత్సాహ చర్యల్లో  భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్‌బీఐ ఖాతాల్లో యావరేజ్‌ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్టున్నట్టు తెలిపింది. ఎస్‌బి‌ఐ బ్యాంక్ కస్టమర్ల ఆనందం కోసం సేవింగ్స్ అకౌంట్  బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.

also read రుణాలపై వడ్డీరేట్లను మళ్ళీ తగ్గించిన ఎస్‌బీఐ బ్యాంక్

దీంతో మొత్తం 44.51 కోట్ల ఎస్‌బిఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్  ఖాతాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇంతకు ముందు ఎస్‌బి‌ఐ సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు మెట్రో, సెమీ అర్బన్,  గ్రామీణ ప్రాంతాల్లో 3000, 2000 లేదా 1000 రూపాయల  మినిమమ్ బ్యాలెన్స్(AMB) నెలవారీ కనీస నిల్వను ఉంచాలి.

ఎఎమ్‌బిని నిర్వహించకపోవడంపై బ్యాంక్ రూ. 5 నుంచి రూ.15 వరకు ఛార్జీలు విధిస్తూండేది. మరోవైపు  ఎస్‌బీఐ బుధవారం ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను, డిపాజిట్లపై  బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను తగ్గించింది.ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ “మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత వల్ల మా విలువైన కస్టమర్లకు మరింత ఆనందాన్ని ఇస్తుంది.  

also read విలాసవంతమైన బంగ్లాలు, వేల కోట్ల ప్రాపర్టీలు ఇవి రాణాకపూర్‌ ఆస్తులు...

నియోగదారులకు మరింత సౌలభ్యం, సంతోషకరమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఎస్‌బి‌ఐ చేసిన మరొక ప్రయత్నం ఇది. దీంతో ఎస్‌బి‌ఐపై వారికి నమ్మకాన్ని పెంచుతుందని మేము నమ్ముతున్నాము. ”అని అన్నారు.‘కస్టమర్స్ ఫస్ట్’ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలో అతిపెద్ద రుణదాత అయిన  ఎస్‌బి‌ఐ తాజా నిర్ణయం దేశంలో  సేవింగ్స్ ఆకౌంట్లను ప్రోత్సహించే ప్రయత్నాలను మరింత పెంచుతుంది.

ముఖ్యంగా, ఎస్‌బి‌ఐ ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఎస్‌బి‌ఐ బ్యాంక్.డిసెంబర్ 31, 2019 నాటికి, ఎస్‌బి‌ఐ 31 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్ కలిగి ఉంది. ఎస్‌బి‌ఐ భారతదేశంలో 21,959 శాఖలతో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఎటిఎమ్ / సిడిఎం నెట్‌వర్క్ 58,500 కు పైగా కలిగి ఉంది.

click me!