ఎస్‌బిఐ యోనో విలువ రూ.3 లక్షల కోట్ల పైనే: చైర్మన్ రజనీష్

Ashok Kumar   | Asianet News
Published : Sep 22, 2020, 03:55 PM ISTUpdated : Sep 22, 2020, 11:04 PM IST
ఎస్‌బిఐ యోనో  విలువ రూ.3 లక్షల కోట్ల పైనే: చైర్మన్ రజనీష్

సారాంశం

ఇటిబిఎఫ్‌ఎస్‌ఐ.కామ్ నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌బిఐ చైర్మన్ మాట్లాడుతూ యోనో లాభదాయకమైన వేదిక అని, ఇది బ్యాంకులోనే ఉన్నందున దాని విలువను ఎవరూ తెలుసుకోలేరని అన్నారు.

ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ యు ఓన్లీ నీడ్ వన్ (యోనో) 40 బిలియన్ డాలర్లకు పైగా విలువను కలిగి ఉందని బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.

ఇటిబిఎఫ్‌ఎస్‌ఐ.కామ్ నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌బిఐ చైర్మన్ మాట్లాడుతూ యోనో లాభదాయకమైన వేదిక అని, ఇది బ్యాంకులోనే ఉన్నందున దాని విలువను ఎవరూ తెలుసుకోలేరని అన్నారు.

‘ఒకవేళ బ్యాంకు వెలుపల ఉండి ఉంటే దీని విలువ ఎంత లేదన్నా 40–50 బిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది. యోనో మొబైల్ యాప్ రోజుకు 70,000 మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంటోందని, ప్రస్తుతం మొత్తం రిజిస్టర్ వినియోగదారులు 27 మిలియన్లు అని ఆయన తెలిపారు.  

also read ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో రుణ పునర్‌వ్యవస్థీకరణ పోర్టల్‌ ప్రారంభం.. ...

మెకిన్సే, ఐబీఎం సాయంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశాం. రోజూ యోనో వేదికగా రూ.70 కోట్ల రుణాలను మంజూరు చేస్తున్నాము అంటూ రజనీష్‌ వివరించారు. సైబర్‌ భద్రత, మోసాల నివారణ విషయంలో కొన్ని స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

కోవిడ్ -19 కారణంగా యోనోలో కొత్త వినియోగదారుల రేటు పెరిగిందని కుమార్ చెప్పారు. “డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో  ప్రజలు నమ్మకం, భద్రత కోసం చూస్తారని కనుగొన్నాము. ప్రజలకు ఎస్‌బిఐపై చాలా నమ్మకం ఉంది"అని కుమార్ చెప్పారు.

ఎస్‌బిఐ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను, పెట్టుబడులను, షాపింగ్ అవసరాలకు సహాయపడటానికి 2017 నవంబర్‌లో యోనో ప్లాట్‌ఫామ్‌ను ఎస్‌బిఐ ప్రారంభించింది.  

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!