ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో రుణ పునర్‌వ్యవస్థీకరణ పోర్టల్‌ ప్రారంభం..

By Sandra Ashok KumarFirst Published 22, Sep 2020, 10:18 AM
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పథకం కింద రుణ పునర్‌వ్యవస్థీకరణ  అర్హతను చెక్ చేయడానికి రిటైల్ కస్టమర్లకు వీలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పథకం కింద రుణ పునర్‌వ్యవస్థీకరణ  అర్హతను చెక్ చేయడానికి రిటైల్ కస్టమర్లకు వీలుగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.

ఎస్‌బి‌ఐ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎస్.శెట్టి మీడియాతో  మాట్లాడుతూ రిటైల్ కస్టమర్లకు 1-24 నెలల తాత్కాలిక ఎంచుకోవడానికి, రుణాలను తిరిగి షెడ్యూల్ చేయడానికి ఆప్షన్  అందిస్తారు. పునర్‌వ్యవస్థీకరణ అర్హత గురించి తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంకుకు వెళ్లడానికి బదులుగా ఆన్‌లైన్‌లోనే ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

also read 

అర్హత కలిగిన కస్టమర్లు తర్వాత పేపర్లపై సంతకాలు చేసేందుకు బ్యాంకుకు వెళితే సరిపోతుందన్నారు. దాదాపు 3,500 మంది రిటైల్ కస్టమర్లు పోర్టల్‌ను యాక్సెస్ చేశారని, 111 మంది వినియోగదారులు పునర్నిర్మాణానికి అర్హులని శెట్టి తెలిపారు.

పునర్నిర్మాణం పొందే రుణగ్రహీతలకు ఇతర కస్టమర్ల కంటే 0.35% శాతం వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పునర్నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 డిసెంబర్ 2020.రుణగ్రహీతలు డిసెంబర్ 31 లోపు మంజూరు చేసిన ప్రణాళికను పొందవలసి ఉంటుంది.

రుణదాత 90 రోజుల్లోపు దానిని అమలు చేయాలి. ఈ పథకం కింద, బ్యాంకులు చెల్లింపులను రీ షెడ్యూల్ చేయవచ్చు, వడ్డీని మరొక క్రెడిట్ సదుపాయంగా మార్చవచ్చు, రెండేళ్ల వరకు తాత్కాలిక నిషేధాన్ని అందించవచ్చు.
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 22, Sep 2020, 11:04 PM