ఎయిర్ ఇండియాకు మరోసారి కరోనా షాక్.. ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడంతో..

Ashok Kumar   | Asianet News
Published : Sep 21, 2020, 04:16 PM IST
ఎయిర్ ఇండియాకు మరోసారి కరోనా షాక్.. ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడంతో..

సారాంశం

హాంగ్ కాంగ్ ప్రభుత్వం   ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకుడికి కరోనా పాజిటివ్ రావడంతో రాకపోకలను మళ్ళీ నిషేధించింది.ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు. వీరంతా చైనా విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది. 

హాంగ్ కాంగ్  విమానయాన విభాగం ఎయిర్ ఇండియా విమానాలను వరుసగా రెండవసారి నిలిపివేసింది. జాతీయ క్యారియర్ ప్రతినిధి మాట్లాడుతూ, "సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు అంటే రెండు వారాల పాటు ఎయిర్ ఇండియా విమానాలను  హాంకాంగ్ నిషేధించింది.

హాంగ్ కాంగ్ ప్రభుత్వం   ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకుడికి కరోనా పాజిటివ్ రావడంతో రాకపోకలను మళ్ళీ నిషేధించింది.ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు.

also read వరుసగా 5వ రోజు కూడా తగ్గిన ఇంధన ధరలు.. నేడు పెట్రోల్ ధర లీటరుకు ఎంతంటే ...

వీరంతా చైనా విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది. ముందుగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌తో ఉన్నప్పటికీ వారికి వ్యాధి నిర్ధారణ జరిగింది. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు రెండు వారాలు నిషేధాన్ని విధిస్తున్నట్టు హాంకాంగ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది.

మరో వైపు ఇదే ఆరోపణలతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను అక్టోబర్ 2 వరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానాలు హాంకాంగ్‌లో నిషేధించడం ఇది మొదటిసారి కాదు.

అంతకుముందు ఆగస్టు 14న ఢీల్లీ-హాంకాంగ్ విమానంలో 14 మంది ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో ఆగస్టు 18 నుండి 31 మధ్యకాలంలో హాంగ్ కాంగ్ పౌర విమానయాన విభాగం జాతీయ క్యారియర్ విమానాలను నిలిపివేసింది.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు