గుడ్ న్యూస్ ఎస్‌బీఐ లోన్లపై వడ్డీరేటు తగ్గింపు...

By Sandra Ashok KumarFirst Published May 7, 2020, 7:51 PM IST
Highlights

బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంకు స్టేట్  బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్ధిక రంగాన్ని వెనక్కి నెట్టేసింది. 

బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంకు స్టేట్  బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్ధిక రంగాన్ని వెనక్కి నెట్టేసింది. దీంతో ఆర్ధిక రంగం కోలుకోవడానికి మరో ఏడాది పడుతుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటి సమయంలో  ప్రభుత్వ రంగా బ్యాంకు ఎస్‌బి‌ఐ అన్ని రకాల  రుణాలపై  వడ్డీరేటు ను తగ్గిస్తున్నట్లు తెలిపింది. మరో విషయం ఏంటంటే  సీనియర్  సిటిజన్ల కోసం ప్రత్యేక  టర్మ్ డిపాజిట్  పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది. 

అన్ని రకాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. కొత్త సవరింపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి దిగి వచ్చింది. ఈ రేట్లు మే 10వ తేదీనుంచి అమల్లోకి రానుంది. ఎంసీఎల్‌ఆర్‌లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది. 

also read మధ్యతరగతి వారికోసం ఎల్‌ఐ‌సి కొత్త పాలసీ..టాక్స్ లేకుండా రూ.23 లక్షలు!

అలాగే  మూడేళ్ల కాల పరిమితిగల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లను మార్చి 12వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానుంది. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో  'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్'  పథకాన్ని లాంచ్  చేసింది.

5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ  వ్యవధిలో ఈ డిపాజిట్లను అందుబాటులో ఉంచనుంది.  వీటిపై  అదనంగా 30 బీపీఎస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని అందించనుంది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అందుబాటులో వుంటుందని ఎస్‌బీఐ తెలిపింది. 

click me!