శాంసంగ్ వైస్ చైర్మ‌న్ కు జైలుశిక్ష… భారీ అవినీతి కేసులో కోర్టు తీర్పు..

Ashok Kumar   | Asianet News
Published : Jan 18, 2021, 04:29 PM IST
శాంసంగ్  వైస్ చైర్మ‌న్ కు జైలుశిక్ష… భారీ అవినీతి కేసులో కోర్టు తీర్పు..

సారాంశం

భారీ అవినీతి కేసులో శాంసంగ్ వైస్ చైర్మ‌న్ కు ఈ శిక్ష‌ను విధించారు. లంచాలు, అవినీతి కుంభకోణం, నిధుల దుర్వినియోగం కేసుల్లో ఈ తీర్పు చేశారు. 

ద‌క్ష‌ణి కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మ‌న్ లీ జే యాంగ్‌(52)కు రెండున్న‌రేళ్ల జైలుశిక్ష ఖ‌రారైనట్లు చైనా వార్తా సంస్థ తెలిపింది. భారీ అవినీతి కేసులో శాంసంగ్ వైస్ చైర్మ‌న్ కు ఈ శిక్ష‌ను విధించారు.

లంచాలు, అవినీతి కుంభకోణం, నిధుల దుర్వినియోగం కేసుల్లో ఈ తీర్పు చేశారు. మరోవైపు ప్ర‌భుత్వ అనుమ‌తుల కోసం భారీ స్థాయిలో శాంసంగ్ లంచాలు ఇచ్చిన‌ట్లు కోర్టులో నిరూపిత‌మైంది.

also read నేడు రికార్డు స్థాయికి చేరుకున్న ఇంధన ధరలు.. పెట్రోల్ ధర లీటరుకు ఎంతంటే ? ...

గత రెండేళ్ల క్రితం ఇలాంటి అవినీతి కేసు వ‌ల్లే ద‌క్ష‌ణి కొరియా అధ్య‌క్షురాలు  పార్క్ గెన్ హై త‌న ప‌ద‌వి కోల్సోవాల్సి వ‌చ్చింది. విస్తృత స్థాయిలో అధికారుల‌కు లంచాలు ఇచ్చిన‌ట్లు  లీ జే యాంగ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మాజీ దేశాధ్య‌క్షురాలు పార్క్ గెన్ అధికారాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు శాంసంగ్ చీఫ్ లంచాలు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కోర్టు పేర్కొన్న‌ది. అవినీతి కేసులో తొలుత సియోల్ కోర్టు లీకి అయిదేళ్ల శిక్ష విధించింది కానీ ఇప్పుడు ఆ శిక్ష‌ను కుదించారు.
 

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు