హైదరాబాద్‌లో ‘ఊకో కాక’ షోరూమ్‌ ప్రారంభం .. సందడి చేసిన టాలీవుడ్ బ్యూటీలు..

Published : Jan 18, 2021, 11:55 AM IST
హైదరాబాద్‌లో ‘ఊకో కాక’ షోరూమ్‌ ప్రారంభం .. సందడి చేసిన టాలీవుడ్ బ్యూటీలు..

సారాంశం

 ‘ఊకో కాక’ స్టోర్‌ను పలువురు సినీ నటులతో పాటు బిగ్‌బాస్‌ సీజన్ 4 పోటీదారులు ఆదివారం ప్రారంభించారు.

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు, బిగ్ బస్ సీజన్ 3 విన్నర్ రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీకాంత్‌ కొండపిలు భాగస్వామ్యులుగా ఏర్పాటు చేసిన ‘ఊకో కాక’ స్టోర్‌ను పలువురు సినీ నటులతో పాటు బిగ్‌బాస్‌ సీజన్ 4 పోటీదారులు ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్టోర్‌లో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో పాల్గొన్న సోహెల్, నోయల్‌, మహబూబ్‌తో పాటు శివజ్యోతి, అశురెడ్డి, హిమజ, రోషిణి తదితరులు పాల్గొని సందడి చేశారు.  

‘ఊకో కాక’ స్టోర్‌ ప్రారంభోత్సవ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ మాట్లాడుతూ ఇది మా రెండో స్టోర్ ప్రారంభం అని, ఉగాది నాటికి తెలుగు రాష్ట్రాల్లో మరో 25 స్టోర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్టోర్‌లో ఏర్పాటు చేసే వస్త్రాలు వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికుల, డిజైనర్లతో రూపొందించినట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Treadmill: ఇది సామాన్యుడి ట్రెడ్‌మిల్‌.. ఇక‌పై ఎంచ‌క్కా ఇంట్లోనే వాకింగ్ చేసుకోవ‌చ్చు