Navi Technologies IPO: మార్కెట్లోకి మరో IPO, రూ.4 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా బరిలోకి నవీ టెక్నాలజీస్..

Published : Mar 08, 2022, 10:48 AM IST
Navi Technologies IPO: మార్కెట్లోకి మరో IPO, రూ.4 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా బరిలోకి నవీ టెక్నాలజీస్..

సారాంశం

మార్కెట్లోకి మరో IPO రానుంది. ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ స్థాపించిన నవీ టెక్నాలజీస్ డిజిటల్ లెండింగ్ యాప్ త్వరలోనే ఐపీవో ద్వారా 4 వేల కోట్లు సమీకరించాలని తీర్మానించుకుంది. 

Navi Technologies IPO: సచిన్ బన్సాల్ నేతృత్వంలోని నవీ టెక్నాలజీస్ తన IPOని తీసుకురావాలని ఆలోచిస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ త్వరలో దాఖలు చేసే వీలుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.4 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ మంగళవారం ఈ సమాచారాన్ని అందజేస్తూ,  ఈ వారంలో రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) డ్రాఫ్ట్‌ను దాఖలు చేయవచ్చని మీడియా వర్గాలకు తెలిపాయి. ఈ IPO జూన్‌లో ప్రారంభించే చాన్స్ ఉందని తెలిపారు. 

ఈ ఇష్యూ కింద, పూర్తిగా కొత్త షేర్లు జారీ చేయనున్నారు.  ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండదు. అంటే ఇప్పటివరకు నవీ టెక్నాలజీస్‌లో దాదాపు రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన బన్సాల్ ఐపీఓలో తన వాటాను తగ్గించుకోవడం లేదు. ఐపీఓ నిర్వహణకు కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్, బోఫా సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్‌లను నియమించిందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

కంపెనీ గురించి తెలుసుకోండి..
నవీ టెక్నాలజీస్ అనేది ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ద్వారా స్థాపించబడింది.  ఇందులో పూర్తి సాంకేతికతతో నడిచే పర్సనల్ లోన్స్ అందించే డిజిటల్ ప్లాట్ ఫాం.

 కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, నవీ అనేది డిజిటల్ లెండింగ్ యాప్, దీని ద్వారా పూర్తిగా పేపర్‌లెస్ ప్రక్రియలో రూ. 20 లక్షల వరకు తక్షణ రుణాలను పొందవచ్చు. మైక్రోఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించడానికి, నవీ గతంలో చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్‌ను 2019లో రూ.739 కోట్లకు కొనుగోలు చేసింది. చైతన్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు