Petrol Diesel Prices Today: స్థిరంగా ధ‌ర‌లు.. నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

Published : Mar 08, 2022, 08:54 AM IST
Petrol Diesel Prices Today: స్థిరంగా ధ‌ర‌లు.. నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

సారాంశం

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 125 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 125 డాలర్లు దాటింది. ఇది పద్నాలుగేళ్ల గరిష్టం. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 125 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 125 డాలర్లు దాటింది. ఇది పద్నాలుగేళ్ల గరిష్టం. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 08, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. 

సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని మొదటి నుండి వినిపిస్తున్న వార్తలు. రేపో మాపో పెరగవచ్చు.

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.07, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.21

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HPPrice అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Cheapest Gold : ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే సిటీ ఏది? ఇక్కడ ఎందుకంత తక్కువ ధర?