రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి ఫ్యూచర్‌’ గ్రూప్‌.. 24వేల కోట్ల డీల్..

By Sandra Ashok KumarFirst Published Aug 31, 2020, 4:18 PM IST
Highlights

ముకేశ్ అంబానీ శనివారం రూ.24,713 కోట్ల రూపాయలకు కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

న్యూ ఢీల్లీ: మరో బ్లాక్‌బస్టర్ ఒప్పందంలో  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెరేలేపింది. ముకేశ్ అంబానీ శనివారం రూ.24,713 కోట్ల రూపాయలకు కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్విఎల్) రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్‌ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

రిలయన్స్ రిటైల్ ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్, ఎఫ్‌బిబి, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ వంటి 1,800 స్టోర్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి భారతదేశంలోని 420కి పైగా నగరాల్లో విస్తరించి ఉన్నాయి.

also read 

"ఈ లావాదేవీతో, ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫార్మాట్స్, బ్రాండ్స్‌కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. చిన్న వ్యాపారులు, కిరణాలతో పాటు పెద్ద వినియోగదారుల బ్రాండ్‌లతో మా ప్రత్యేకమైన సహకారంతో రిటైల్ పరిశ్రమ ఊపందుకుంది.

దేశవ్యాప్తంగా మా వినియోగదారులకు విలువను అందించడం కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము "అని ఇషా అంబానీ అన్నారు. ఇక డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. 
 

click me!