
ముంబై: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం నయే దునియా కి నయా జోష్ పేరుతో జియో ఫైబర్ ప్లాన్ లను ఆవిష్కరించింది. జియో ఫైబర్ కొత్త వినియోగదారులకోసం "నో కండిషన్ ఫర్ 30 డేస్ ట్రయల్" తీసుకొచ్చింది.
ప్రస్థుత పరిస్థితులలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు ఇంటర్నెట్ వినియోగం పెరుగుదలకు సహకరించాయి. తాజాగా పవేశపెట్టిన జియో ఫైబర్ ప్లాన్లు బడ్జెట్ ధరకే అధిక లాభాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం తప్పసరి చేస్తుంది.
కొత్త జియోఫైబర్ ప్లాన్స్ :
1. ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్
2. సిమెట్రిక్ స్పీడ్ (అప్‌లోడ్ వేగం = డౌన్‌లోడ్ వేగం)
3. నెలకు 399 రూపాయలతో ప్లాన్స్ ప్రారంభవుతాయి
4. అదనపు ఖర్చు లేకుండా టాప్ 12 పెయిడ్ ఓటిటి యాప్స్ కి సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తుంది.
దీనిపై జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ “జియో ఫైబర్ ఇప్పటికే మిలియన్‌కు పైగా కనెక్షన్లతో దేశంలో అతిపెద్ద ఫైబర్ ప్రొవైడర్ గా ఉంది. మేము ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ తీసుకురావాలనుకుంటున్నాము.
also read ఎన్‌పీసీఐకి షాకీవ్వనున్న ఎస్‌బీఐ.. డిజిటల్ పేమెంట్ విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటు.. ...
జియోతో మొబైల్ కనెక్టివిటీలో భారతదేశాన్ని అతిపెద్ద, వేగవంతమైన పెరుగుతున్న దేశంగా చూడాలనుకుంటున్నాము, జియో ఫైబర్ భారతదేశంలో గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ అధిగమిస్తుంది. తద్వారా 1,600 నగరాలు మరియు పట్టణాలకు బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తుంది.
భారతదేశాన్ని ప్రపంచ బ్రాడ్‌బ్యాండ్ లీడర్ గా మార్చడానికి జియోఫైబర్ ఉద్యమంలో చేరండి అని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని అన్నారు.
జియోఫైబర్ నో-కండిషన్ 30-డేస్ ఫ్రీ ట్రయల్ లో
1. 150 Mbps ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్
2. 4K సెట్ టాప్ బాక్స్ ద్వారా టాప్ 10 పెయిడ్ ఓటిటి యాప్స్ అక్సెస్ అందిస్తుంది
3. ఫ్రీ వాయిస్ కాలింగ్
4. మీకు సర్వీస్ నచ్చకపోతే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా మేము దానిని తిరిగి తీసుకుంటాము
5. కొత్త కస్టమర్లందరికీ 30 రోజుల ఉచిత ట్రయల్ వర్తిస్తుంది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ గురించి:
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (“జియో”) సరికొత్త 4జి ఎల్‌టిఇ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి ఆల్-ఐపి డేటా నెట్‌వర్క్‌ను నిర్మించింది.
ఇది భవిష్యత్తులో సులభంగా 5G, 6G టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. జియో కస్టమర్ల కోసం భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా, ఎల్లప్పుడూ వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. జియో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, సరసమైన డేటా మార్కెట్‌గా చేస్తుంది.