Reliance Jewels: ల‌వ‌ర్స్ కోసం రిల‌య‌న్స్ జువెల్స్ స్పెష‌ల్‌ క‌లెక్ష‌న్‌.. ప్రారంభ ధ‌ర‌ రూ. 12,000..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 11, 2022, 03:35 PM IST
Reliance Jewels: ల‌వ‌ర్స్ కోసం రిల‌య‌న్స్ జువెల్స్ స్పెష‌ల్‌ క‌లెక్ష‌న్‌.. ప్రారంభ ధ‌ర‌ రూ. 12,000..!

సారాంశం

భారతదేశపు ప్రముఖ జ్యూయలరీ బ్రాండ్‌- రిలయన్స్‌ జువెల్స్ ప్రేమికుల కోసం వాలెంటైన్స్ డే కలెక్షన్స్‌ “ఫ్లోరియో”ను ఆవిష్కరించింది. కాలంతో పాటు ఎదుగుతూ బలపడే ప్రేమ భావనను అందిపుచ్చుకుంటూ ఈ లవ్‌ సీజన్‌లో వాలెంటైన్స్ డే జరుపుకునేందుకు ఆధునికత కలబోసిన అతి సరళమైన డిజైన్లను రిలయన్స్‌ జువెల్స్ విడుదల చేసింది.

భారతదేశపు ప్రముఖ జ్యూయలరీ బ్రాండ్‌- రిలయన్స్‌ జువెల్స్ ప్రేమికుల కోసం వాలెంటైన్స్ డే కలెక్షన్స్‌ “ఫ్లోరియో”ను ఆవిష్కరించింది. కాలంతో పాటు ఎదుగుతూ బలపడే ప్రేమ భావనను అందిపుచ్చుకుంటూ ఈ లవ్‌ సీజన్‌లో వాలెంటైన్స్ డే జరుపుకునేందుకు ఆధునికత కలబోసిన అతి సరళమైన డిజైన్లను రిలయన్స్‌ జువెల్స్ విడుదల చేసింది. ప్రతీరోజు ఎంతో అందంగా పెరిగే మొక్కలు, పూలను ప్రేరణగా తీసుకొని ఈ కలెక్షన్‌లోని డిజైన్లు రూపొందించారు.  ఈ సొగసైన డైమండ్ కలెక్షన్‌లోని ప్రతి ఆభరణం నిజమైన ప్రేమను పంచేలా ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేయబడింది. ఈ ప్రత్యేకమైన కలెక్షన్ ‘ఫ్లోరియో’ అద్భుతమైన డిజైన్లలో రోజ్ గోల్డ్, ఎల్లో గోల్డ్‌ రింగులు, పెండెంట్లుగా లభిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.12,000గా ఉంది.

కొత్త కలెక్షన్ ప్రవేశపెట్టడంతో పాటు డ్రీమ్ డైమండ్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ కూడా ప్రకటించింది సంస్థ‌. ఫిబ్రవరి 28 వరకు ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జ్యువెల్స్‌లో కొనుగోలు చేసే డైమండ్ ఆభరణాలపై ఇన్వాయిస్ విలువపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును కూడా కొనుగోలుదారులు పొందవచ్చు. ఈ అద్భుతమైన కలెక్షన్ దేశ వ్యాప్తంగా ఉన్నరిలయన్స్ జువెల్స్ ప్ర‌త్యేక షోరూమ్స్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన రేంజ్ లయన్స్ జ్యువెల్స్ వెబ్ సైట్‌ www.reliancejewels.comలో కూడా లభిస్తుందని సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు.

కొత్త కలెక్షన్‌ గురించి రిలయన్స్ జువెల్స్ సీఈవో సునీల్‌ నాయక్‌ మాట్లాడుతూ.. “ ఈ ప్రేమ సీజన్‌లో మేము మా సరికొత్త కలెక్షన్‌ ఫ్లోరియో ద్వారా మా విలువైన కస్టమర్లతో నిజమైన ప్రేమను పంచాలని కోరుకుంటున్నాం. ఖాతాదారులకు ఎప్పుడూ ఉత్తమమైనవే అందించాలన్నది మా లక్ష్యం. ప్రేమలో ఎదగండి అనే సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకొని రూపొందించిన ఈ డిజైన్స్‌, ఒకరిని ఒకరు ప్రేమించేలా, బంధాలు బలోపేతం చేసేలా స్ఫూర్తి నింపుతాయని మేము ఆశిస్తున్నాం” అని ఆయ‌న అన్నారు.


రిలయన్స్ జ్యువెల్స్ గురించి
భారతదేశంలో టాప్‌-10 విశ్వసనీయమైన బ్రాండ్స్‌లో ఒకటైన రిలయన్స్ రిటైల్‌ లిమిటెడ్‌లో భాగం రిలయన్స్ జువెల్స్. అద్భుతమైన, విస్తృత శ్రేణి గోల్డ్, డైమండ్, ప్లాటినం &సిల్వర్ ఆభరణాల కలెక్షన్స్ అందిస్తుంది ఈ బ్రాండ్. డిజైన్, నైపుణ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కళలు, హస్తకళలు, ఘనమైన భారతీయ వారసత్వం నుంచి ప్రేరణ పొంది ప్రత్యేకమైన, వైవిధ్యభరితమైన డిజైనర్‌ కలెక్షన్స్‌ను కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. కస్టమర్లు తమ జీవితంలోని ప్రతీ ప్రత్యేకమైన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని రిలయన్స్ జ్యువెల్స్ కోరుకుంటుంది. భారతదేశంలో 125+ నగరాల్లో 250+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు &షాప్-ఇన్ షాపులు కలిగిన రిలయన్స్‌ జ్యువెల్స్ వాటిని గణనీయంగా విస్తరిస్తోంది. ఖాతాదారులకు అనుపమానమైన సేవలు, ఒక ప్రత్యేకమైన ఆభరణాల కొనుగోలు షాపింగ్ అనుభూతిని అందించేందుకు బ్రాండ్‌ ఎల్లవేళల కృషి చేస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో స్వర్ణ, వజ్రాభరణాలు అత్యంతసరసమైన ధరల్లో లభిస్తాయి.  

జీరో వేస్టేజ్‌, సరసమైన తయారీ ధరలు, కొనుగోలుదారులకు 100%సంతృప్తిని అందిస్తాయి. 100 శాతం స్వచ్ఛత, పారదర్శకమైన ధరల విధానం, ప్రతీ నగపై హమీపూర్వక నాణ్యతను రిలయన్స్ జ్యువెల్స్‌అందిస్తుంది. 100 శాతం బీఐఎస్‌ హాల్‌మార్క్డ్‌ బంగారం, అంతర్జాతీయంగా స్వతంత్ర ధ్రువీకరణ ప్రయోగశాలలు ధ్రువీకరించిన ఆభరణాలను మాత్రమే ఈ బ్రాండ్‌ విక్రయిస్తుంది. రిపేర్ల కోసం క్యూసీటెక్‌రూమ్స్‌తో పాటు బంగారం స్వచ్ఛతను కొనుగోలుదారులు ఉచితంగా తెలుసుకునేందుకు క్యారెట్‌ మీటర్‌, ఇంకా ఎన్నో సేవలు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. ప్రతీ కొనుగోలుపై లాయల్టీ పాయింట్లు కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది. ప్రతీ కలెక్షన్‌లో మైమరపింపజేసే డిజైన్లు అందించే రిలయన్స్ జ్యువెల్స్‌లో ప్రతీ వ్యక్తిత్వానికి, ప్రతీ సందర్భానికి ఒక ఆభరణం లభిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్