
సెన్సోడైన్ యాడ్‌ను ప్రసారం చేస్తున్న గ్లాక్సోస్మిత్ క్లైన్ (GSK) కన్జ్యూమర్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు పెద్ద షాక్ తగిలింది. దేశంలో సెన్సోడైన్ టూత్ పేస్ట్ ప్రకటనలన్నింటినీ ఆపేయాల్సిందిగా గ్లాక్సోస్మిత్ క్లైన్ (జీఎస్కే) కన్జ్యూమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థను వినియోగదారుల భద్రత సంస్థ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనలను తీశారని సంస్థ పేర్కొంది. అంతేగాకుండా నాప్టోల్ ఆన్ లైన్ షాపింగ్ లిమిటెడ్ సంస్థపైనా ఆక్షేపణలు చేసింది. ప్రజలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలను ఇస్తున్నారని, అనైతిక వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థకు రూ.10 లక్షల జరిమానా వేసింది.
జీఎస్కే, నాప్టోల్ ప్రకటనలపై సీసీపీఏ సుమోటోగా కేసును స్వీకరించిన సీసీపీఏ.. జనవరి 27న జీఎస్కేకి, ఫిబ్రవరి 2న నాప్టోల్ కు నోటీసులు ఇచ్చినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటన జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సెన్సోడైన్ ప్రకటనలను ఆపేయాల్సిందిగా జీఎస్కేకి ఆదేశాలిచ్చిందని ప్రకటనలో తెలిపింది.
భారత్ వెలుపల ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్టులతో ప్రకటనలు చేయించి భారత్ లో ప్రసారం చేశారని పేర్కొంది. అది భారత నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. అంతేగాకుండా సెన్సోడైన్ ప్రకటనల్లో పేర్కొన్నట్టు ‘ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫార్సు చేస్తున్న నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ సెన్సోడైన్’, ‘60 క్షణాల్లోనే పంటి నొప్పి నుంచి ఉపశమనం.. క్లినికల్ గా నిరూపణ’ వంటి కామెంట్లపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సీసీపీఏ ఆదేశించింది. న్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, సెక్షన్ 2(28) మేరకు వాణిజ్య ప్రసారాల నిబంధనలు అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ అంశంపై డైరెక్టర్ జనరల్(ఇన్వెస్టిగేషన్) విచారణ జరిపి 15 రోజుల్లోగా రిపోర్టు అందించాలని సీసీపీఏ ఆదేశించింది.
దీనిపై గ్లాక్సోస్మిత్ క్లైన్ (GSK) కన్జ్యూమర్ హెల్త్‌కేర్ లిమిటెడ్ స్పందిస్తూ.. ‘సీసీపీఏ నుంచి మాకు నోటీసు అందింది. ఇండస్ట్రీ గైడ్‌లైన్స్ పరిధిలోనే మా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని మేము వివరిస్తాం. వినియోగదారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న మాకు ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది’ అని ప్రకటించింది.
అలాగే.. న్యాప్టాల్‌కు కూడా సీసీపీఏ నోటీసు ఇచ్చింది. అడ్వెర్టైస్‌మెంట్లను ఆపేయాలని పేర్కొంది. సెట్ ఆఫ్ 2 గోల్డ్ జ్యూయలరీస్, మ్యాగ్నెటిక్ నీ సపోర్ట్, ఆక్యుప్రెసర్ యోగా స్లిప్పర్స్ వంటి ఉత్పత్తలపై చేస్తున్న ప్రసారాలను సీసీపీఏ తప్పుబట్టింది. న్యాప్టాల్‌కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. న్యాప్టాల్ ఇస్తున్న ఆఫర్లు లైవ్ టెలికాస్ట్ కాదని, రికార్డు చేసినవి చూపిస్తున్నారని నోటీసులో పేర్కొంది. ది నేషనల్ కన్జ్యూమర్ హెల్త్‌లైన్ సమాచారం మేరకు న్యాప్టాల్‌పై 2021 మే నెల నుంచి 2022 జనవరి మధ్య వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి,15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని CCPA న్యాప్టాల్ ను ఆదేశించింది. ది నేషనల్ కన్జ్యూమర్ హెల్త్‌లైన్ సమాచారం మేరకు న్యాప్టాల్‌పై 2021 మే నెల నుంచి 2022 జనవరి మధ్య 399 కంప్లైంట్స్ వచ్చాయని సీసీపీఏ స్పష్టం చేసింది.