Biryani Chain Paradise: 2027 నాటికి 500 రెస్టారెంట్లు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 11, 2022, 02:46 PM IST
Biryani Chain Paradise: 2027 నాటికి 500 రెస్టారెంట్లు..!

సారాంశం

దాదాపు ఏడు దశాబ్దాలపైగా చరిత్ర గల బిర్యానీ చెయిన్‌ ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్స్‌ దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 100 రెస్టారెంట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2026–27 నాటికి దీన్ని 500కు పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో గౌతమ్‌ గుప్తా తెలిపారు. 

దాదాపు ఏడు దశాబ్దాలపైగా చరిత్ర గల బిర్యానీ చెయిన్‌ ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్స్‌ దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 100 రెస్టారెంట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2026–27 నాటికి దీన్ని 500కు పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో గౌతమ్‌ గుప్తా తెలిపారు. హైదరాబాద్‌ బిర్యానీకి మారుపేరుగా మారిన ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్స్‌ 50 రెస్టారెంట్లు నిర్వహిస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశ, విదేశాల్లో కొత్తగా 500 రెస్టారెంట్లు ఏర్పా టు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన రూ.2,000 కోట్ల పెట్టుబడుల్లో 75 శాతం అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోనున్నట్టు ప్యారడైజ్‌ ఫుడ్‌కోర్ట్స్‌ కంపెనీ సీఈఓ గౌతమ్‌ గుప్తా చెప్పారు. 

ఈ ఏడాది చివరి నాటికి వివిధ నగరాల్లో కొత్తగా 50 రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కొవిడ్‌ సవాళ్లు ఉన్నా గత నాలుగు నెలల్లో వివిధ నగరాల్లో 8 కొత్త రెస్టారెంట్లు ఏర్పాటు చేసినట్టు గుప్తా తెలిపారు. 2024కల్లా ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఉత్తర అమెరికా, ఐరోపా, పశ్చిమ, ఆగ్నేయాసియా దేశాల్లోనూ రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. 2027 నాటికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న 500 రెస్టారెంట్లలో 100 రెస్టారెంట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా ల్లో ఏర్పాటు చేయాలని ప్యారడైజ్‌ భావిస్తోంది. వీటిని తొలి దశ విస్తరణలోనే ఏర్పాటు చేస్తారు. రెండో దశ విస్తరణలో భాగంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 100 రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు.

హైదరాబాద్‌లో 50వ రెస్టారెంట్‌ ప్రారంభించిన సందర్భంగా సంస్థ సీఈవో గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో కార్యకలాపాలు ఉండగా తూర్పు, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విస్తరించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో 200 - 250 రెస్టారెంట్లు ప్రారంభించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈస్ట్‌లో కోల్‌కతాపై ఫోకస్‌ చేయనుంది ప్యారడైజ్‌. విస్తరణలో భాగంగా త‍్వరలో దేశవ్యాప్తంగా 500 రెస్టారెంట్లను ప్రారంభించాలని ప్యారడైజ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వందకు పైగా రెస్టారెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పనుంది. దాదాపుగా పాత జిల్లా కేంద్రాలు, ప్రముఖ పట్టణాల్లో రెస్టారెంట్లు వచ్చే ఆస్కారం ఉంది. ఇటీవల వరంగల్‌ లాంటి టైర్‌ టూ సిటీలో కూడా రెస్టారెంట్‌ ప్రారంభించింది ప్యారడైజ్‌. త్వరలో ఇతర పట్టణాల్లోనూ ప్యారడైజ్‌ బిర్యానీ అందుబాటులోకి రానుంది.

సికింద్రాబాద్‌లో ప్యారడైజ్‌ సినిమా థియేటర్‌కి అనుబంధంగా చిన్న క్యాంటీన్‌గా ప్యారడైజ్‌​ బిర్యానీ ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా బిర్యానీ బ్రాండ్‌గా ఎదిగింది. త్వరలోనే యూకే, యూఎస్‌, మిడిల్‌ ఈస్ట్‌, సౌత్‌ఈస్ట్‌ దేశాల్లోనూ ఫ్రాంచైజీ పద్దతిన రెస్టారెంట్లు ప్రారంభించనుంది. ప్యారడైజ్‌ ఫుడ్‌కోర్ట్స్‌ 2027 నాటికి రూ. 2,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్