హయత్ నగర్ లో మరో రిలయన్స్ డిజిటల్ స్టోర్ ... ప్రారంభించిన నటి నభా నటేష్

By Arun Kumar P  |  First Published Aug 3, 2024, 7:53 PM IST

ప్రముఖ సినీనటి నభా నటేష్ చేతులమీదుగా హైదరాబాద్ లో మరో రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రారంభమయ్యింది. హయత్ నగర్ లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్ లో సరికొత్త ఆఫర్లు అందుబాటులో వున్నాయి. 


హైదరాబాద్ : హైదరాబాద్ ప్రజలకు మరింత చేరువయ్యింది రిలయన్స్ డిజిటల్. ఇప్పటికే నగరవ్యాప్తంగా పలు స్టోర్స్ అందుబాటులో వుండగా తాజాగా హయత్ నగర్ లో మరో స్టోర్ ను ఏర్పాటుచేసింది రిలయన్స్ డిజిటల్. సరిగ్గా భగత్ విలేజ్ ఆర్టిసి సూపర్వైజర్స్ కాలనీలో అత్యంత భారీగా ఈ స్టోర్ ను తీర్చిదిద్దారు. రెండు అంతస్తుల్లో 8,000 చదరపు అడుగులతో చాలా విశాలంగా వుంది. ఇలా సరికొత్తగా ఏర్పాటుచేసిన స్టోర్ లో ఆఫర్లు కూడా అంతే కొత్తగా వున్నాయి. ఈ రిలయన్స్ స్టోర్ లో విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్స్ ను కస్టమర్లకు సరసమైన ధరలకే అందిస్తున్నారు. 

కేవలం నాణ్యమైన ఎలక్ట్రానిక్స్ అందించడమే కాదు కస్టమర్లకు టెక్నికల్ సహకారం కూడా అదించనున్నారు. నిపుణులైన ఉద్యోగులు కొనుగోలుకు ముందే ఆ వస్తువు పూర్తి సమాచారాన్ని వివరిస్తారు... అనంతరం కూడా ఆ ఎలక్ట్రానికి సంరక్షణ బాధ్యతలను రెస్క్యూ సర్వీస్ ఎక్ఫర్ట్స్ చూసుకుంటారు. వేగవంతమైన డెలివరీని అందించి అంతే వేగంగా ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ బిగించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు ఇక ఆలస్యం చేయకుండా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయడానికి హయత్ నగర్ రిలయన్స్ డిజిటల్స్ స్టోర్ కు విచ్చేయండి. 

Latest Videos

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ చేతులమీదుగా హయత్ నగర్ రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కొందరు కస్టమర్లకు ఆమెను కలిసే అవకాశం దక్కింది... అంతేకాదు ఆమె సంతకంతో కూడిన వస్తువులను అందుకున్నారు. ఇక ఈ స్టోర్ లో పలు బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం తగ్గింపు పొందవచ్చు. 

500కు పైగా అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు చెందిన 2,000కు పైగా ఉత్పత్తులను రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. వీటిలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, హోమ్ థియేటర్లు, డిజిటల్ కెమెరాలు, ల్యాప్ టాప్ వంటివాటితో పాటు ఇతర చిన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా వున్నాయి. ఇలా వినియోగదారుల అవసరమైన ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల రిలయన్స్ డిజిటల్స్ లో లభిస్తాయి. 

వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే ప్రపంచస్థాయి టెక్నాలజీతో కూడిన వస్తువులు అందించాలన్నదే రిలయన్స్ డిజిటల్ లక్ష్యం. కస్టమర్లకు ఫైనాన్స్ సేవలతో పాటు ఈజీ ఈఎంఐ సదుపాయంలో మంచి ఆఫర్లను అందిస్తోంది. ప్రతి కస్టమర్ వారి జీవనశైలికి తగిన మంచి ఉపకరణాలను అందించడమే రిలయన్స్ డిజిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 

రిలయన్స్ డిజిటల్స్ :  

భారత దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ అమ్మకాలను చేపడుతున్న సంస్థ రిలయన్స్ డిజిటల్. దేశంలోని 800 నగరల్లో 642కు పైగా స్టోర్స్ ని కలిగివుంది రిలయన్స్ డిజిటల్. అంతేకాదు 1454కు పైగా మై జియో స్టోర్స్ వున్నాయి. వీటిద్వారా దేశ నలుమూలలకు కూడా ఎలక్ట్రానిక్స్ చేర్చగలుగుతోంది.  ఇలా 300 జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ కు చెందిన 5000 వస్తువులను సరసమైన ధరలకు అందిస్తోంది రిలయన్స్ డిజిటల్. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ మార్కెట్ లో మంచి పేరును సంపాదించుకుంది రిలయన్స్ డిజిటల్స్. కాబట్టి రిలయన్స్ డిజిటల్ స్టోర్ ను సందర్శించి లేదంటే www.reliancedigital.in ద్వారా నచ్చిన ప్రోడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. 

click me!