వచ్చే నెల ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకులకు సెలవులు వచ్చినా బ్యాంకింగ్ వ్యాపారంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.
ఈరోజుల్లో బ్యాంకులు ప్రజలకి కేవలం డబ్బును డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి మాత్రమే కాకుండా ఎన్నో ఆర్థిక సేవలను అందిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతినెల బ్యాంకు హాలిడేస్ లిస్ట్ గురించి తెలుసుకోవాలి. ఆదివారాలతో పాటు ప్రతి రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఈ సెలవులు కాకుండా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులకు ఇతర ప్రభుత్వ సెలవులు కూడా వర్తిస్తాయి. అయితే వచ్చే నెల ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకులకు సెలవులు వచ్చినా బ్యాంకింగ్ సేవల పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఇంకా ఆన్‌లైన్ సేవలు 24x7 అందుబాటులో ఉంటాయి.
ఆగస్టు నెలలో మూడు ముఖ్యమైన పండుగలు రానున్నాయి. రాఖీ పండుగ, జన్మాష్టమి, స్వాతంత్య్ర దినోత్సవ రోజున ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. ఈ మూడు పండుగలతో పాటు నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు కలిపితే 10 సెలవులు అవుతాయి. మిగిలిన నాలుగు సెలవులు ఏంటో తెలుసా...
ఆగస్టు 2024- బ్యాంక్ హాలిడేస్ లిస్ట్
ఆగస్టు 3: అగర్తలాలో కేరా పూజ కారణంగా ఈ ప్రాంతంలోని బ్యాంకులు మూసివేయబడతాయి.
ఆగష్టు 4: ఆదివారం
ఆగస్టు 7: హరియాలీ తీజ్ నేపథ్యంలో హర్యానాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 8: ఈ రోజు సిక్కింలో Tendong Lho RumFaat జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సిక్కింలో ప్రభుత్వ సెలవు ప్రకటించనున్నారు.
ఆగష్టు 10: నెలలో రెండవ శనివారం
ఆగస్టు 11: ఆదివారం
ఆగస్టు 13: ఇంఫాల్‌లో పేట్రియాట్ డే జరుపుకుంటారు. ఈ రోజు బ్యాంకులు మూసివేయబడతాయి.
ఆగష్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు 18: ఆదివారం
ఆగస్టు 20: శ్రీ నారాయణ గురు జయంతి సందర్బంగా కొచ్చి, తిరువనంతపురంలో సెలవు ప్రకటించారు.
ఆగస్ట్ 24: నాల్గవ శనివారం
ఆగస్టు 25: ఆదివారం
ఆగస్టు 24: కృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కాబట్టి దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఉంటాయి.
ఈ సెలవుల్లో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పనిని ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. బ్యాంకు సెలవుల్లో కూడా కస్టమర్లకు ATM సేవలు తెరిచి ఉంటాయి. డెబిట్ కార్డు సహాయంతో, ATM ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంకా కస్టమర్లకు డిపాజిట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.