ఆగస్టు నెల నుండి ఎల్‌పీజీ సిలిండర్ల నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించిన రూల్స్ మారనున్నాయి. కాబట్టి ఏయే రూల్స్‌ను మారనున్నాయో చూద్దాం...
మరో రెండు రోజుల్లో జులై నెల ముగిసి, ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. అయితే వచ్చే నెల 1వ తేదీ నుండి కొన్ని రూల్స్ మారిపోనున్నాయి. ఈ రూల్స్ మార్పు నేరుగా ప్రజల జేబులపై ప్రభావం చూపవచ్చు. జులైలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఆగస్టు ప్రారంభం కాగానే ఎల్‌పీజీ సిలిండర్ల నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఏయే రూల్స్‌ను మార్చనున్నాయో చూద్దాం...
1.LPG సిలిండర్ ధర
ప్రతి నెలా 1వ తేదీన ఇంటి, వాణిజ్య అవసరాల కోసం సిలిండర్ ధరలు సవరిస్తుంటారు. జూలైలో వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టగా, వంటింటి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉంది. సిలిండర్ ధరల పెంపు నేరుగా హోటల్ ఫుడ్ ధరల పై ప్రభావం చూపవచ్చు. దేశీయ సిలిండర్ ధరలు ఈసారి కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
2. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన కొన్ని రూల్స్ ఆగస్టు-2024 నుండి మారనుంది. HDFC బ్యాంక్ CRED, Cheq, MobiKwik, క్రెడిట్ కార్డ్ పేమెంట్లతో సహా ఫ్రీఛార్జ్ సేవలపై కస్టమర్ల నుండి 1% ట్రాన్సక్షన్స్ చార్జెస్ వసూలు చేస్తుంది. దీని లిమిట్ రూ.3,000 వరకు మాత్రమే. ఇంధన లావాదేవీలు 15,000 రూపాయల కంటే ఎక్కువ అయితే పూర్తి మొత్తానికి 1% సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. బ్యాంక్ EMI ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 299 వసూలు చేస్తుంది.
3. గూగుల్ మ్యాప్స్ సర్వీస్ రిపోర్ట్‌ల ప్రకారం, ఆగస్టు 2024 నుండి భారతదేశంలో గూగుల్ మ్యాప్స్ సర్వీస్ ఛార్జీ తగ్గించబడుతుంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్ట్ 1 నుండి వర్తిస్తాయి, ఇది నేరుగా యూజర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త నిబంధనల కారణంగా, ఖర్చు 70% తగ్గుతుంది.