
RBI Stops Paytm Payments Bank: ప్రముఖ పేమెంట్స్ బ్యాంక్ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది. పలు నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం తాజాగా జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెంటనే అమలులోకి వచ్చేలా ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల్లో కొత్త కస్టమర్లను తన ప్లాట్‌ఫారమ్‌లొ చేర్చుకోవద్దని Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని ఆదేశించింది. దీంతో పాటు ఐటీ ఆడిట్ సంస్థను కూడా నియమించాలని బ్యాంకును ఆదేశించింది.
RBI పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో పలు లోపాలను సూచిస్తూ, 'మెటీరియల్ సూపర్‌వైజరీ' ఆందోళనల కారణంగా Paytm పేమెంట్స్ బ్యాంక్‌కి ఈ ఆదేశాలను అందించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆదేశాల్లో పేటీఎం బ్యాంకు ఐటి సిస్టమ్‌పై సమగ్ర ఆడిట్ నిర్వహించడానికి ఆడిట్ సంస్థను నియమించాలని కూడా ఆదేశించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటి వరకూ కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది.
కొత్త కస్టమర్‌లను ఎప్పుడు చేర్చుకోగలదు...
IT ఆడిటర్ నివేదికను సమీక్షించిన తర్వాత RBI నుండి నిర్దిష్ట అనుమతికి లోబడి Paytm పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్‌లను చేర్చుకోగలుగుతుంది.
Paytm పేమెంట్స్ బ్యాంక్ డిసెంబర్‌లో షెడ్యూల్డ్ పేమెంట్స్ బ్యాంక్‌గా పనిచేయడానికి RBI ఆమోదం పొందింది. పేమెంట్స్ బ్యాంక్ అనుమతి ద్వారా పేటీఎం తన ఆర్థిక సేవల కార్యకలాపాలను విస్తరించడంలో సహాయపడుతుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A ప్రకారం, కొత్త కస్టమర్ల ఆన్‌బోర్డింగ్‌ను తక్షణమే అమలులోకి తీసుకురావాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈరోజు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని ఆదేశించింది.
Paytm స్టాక్ క్షీణతతో ముగిసింది
ఈరోజు బీఎస్ఈలో Paytm స్టాక్ క్షీణించింది. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (PAYT) షేర్ 1.05 పాయింట్లు (-0.14 శాతం) పడిపోయి 774.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.50,247.65 కోట్లు.
ఇదిలా ఉంటే 2021లో కూడా RBI, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు భారీ జరిమానా విధించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో కోటి రూపాయల జరిమానా విధించింది. పేటీఎంతో పాటుగా వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థకు రూ.27.8 లక్షల జరిమానా వేసింది. రెమిటెన్స్ లిమిట్ అతిక్రమణ నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు పెనాల్టీ విధించింది.