Maruti Suzuki Celerio: దక్షిణాఫ్రికాలో ఇండియన్ బ్రాండ్ కారు విడుద‌ల‌..!

By team telugu  |  First Published Mar 11, 2022, 6:01 PM IST

ప్రపంచ మార్కెట్లో భారతదేశంలో ఉత్పత్తైన కార్లకు మంచి డిమాండ్ ఉంది. అంతే కాకుండా ప్రపంచ మార్కెట్లో దేశీయ కార్లు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.


ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) కొంత కాలం క్రితం భారతీయ మార్కెట్‌లో కొత్త 'మారుతి సుజుకి సెలెరియో' (Maruti Suzuki Celerio) విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ సెలెరియోని దక్షిణాఫ్రికా మార్కెట్‌లో కూడా విడుదల చేసింది. 

ఇప్పుడు దక్షిణాఫ్రికాలో విడుదలైన కొత్త సుజుకి సెలెరియో కేవలం 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. దీనికి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనే రెండు ఆప్ష‌న్స్ ఇవ్వబడింది. నిజానికి కంపెనీ సెలెరియోలో 1.0 లీటర్ కె10సి సిరీస్ త్రీ-సిలిండర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా పొందుతుంది.

Latest Videos

undefined

కొత్త మారుతి సెలెరియో స్విఫ్ట్, బాలెనో మాదిరిగానే సుజుకి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఫాగ్ లైట్స్ వంటివి ఉన్నాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో.. కొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కాల్, మ్యూజిక్ అసిస్ట్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సింగిల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సర్క్యులర్ డిజిటల్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు కంపెనీ సెలెరియోలో హెడ్ ​​లైట్ డిజైన్ అప్‌డేట్ చేయబడింది. బాడీ అనేక మార్పులకు గురైంది. దీని కారణంగా ఇది మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త సెలెరియోలో 15 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, ORVMలలో టర్న్ ఇండికేటర్ ఉంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక కొత్త అప్‌డేట్ చేయబడిన ఫీచర్లను ఈ కారు పొందుతుంది. ఇది కాకుండా ఈ కారులో ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో పాటు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త మారుతి సెలెరియోలో బూట్ స్పేస్ ఇప్పుడు 313 లీటర్లకు పెరిగింది. ఇందులో డ్రైవర్, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రియర్ డోర్ చైల్డ్ ప్రూఫ్ లాక్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ మొదలైన వాటిని పొందుతుంది.

మారుతి సుజుకి సెలెరియో 26.68 కిమీ/లీ మైలేజీని అందించగలదని మారుతి సుజుకి పేర్కొంది. ఇది భారతదేశంలోని కార్ల తయారీదారులు అందించే అన్ని ఇతర కార్లలో అత్యంత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ కొత్త సెలెరియోను సిల్కీ సిల్వర్, గ్లిస్టరింగ్ గ్రే, ఆర్కిటిక్ వైట్, కెఫిన్ బ్రౌన్‌తో పాటు రెండు కొత్త రంగులు ఫైర్ రెడ్, స్పీడీ బ్లూ కలిపి మొత్తం 6 రంగులలో పరిచయం చేసింది. ఇది 4 ట్రిమ్‌లు, 7 వేరియంట్‌లలో అందించబడుతుంది.

కొత్త మారుతి సెలెరియో దాని పాత మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. దీని వీల్‌బేస్ మునుపటి కంటే పొడవుగా ఉంది. ఇది కారు లోపల మునుపటి కంటే ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. కావున ఈ కొత్త మారుతి సెలెరియో దాని మునుపటి మోడల్ కంటే కూడా అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. భారత మార్కెట్‌లో కొత్త మారుతి సెలెరియో (Maruti Celerio) CNG వెర్షన్ కూడా అందుబటులో ఉంది. ఈ కొత్త సెలెరియో సిఎన్‌జి ధర రూ. 6.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది కూడా ఆధునిక ఫీచర్స్, పరికరాలను కలిగి ఉంటుంది.

కొత్త మారుతి సెలెరియో CNG వెర్షన్ పెట్రోల్-బేస్డ్ కారు నుండి అదే 1.0-లీటర్ K10C డ్యూయల్‌జెట్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 57 బిహెచ్‌పి పవర్, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే స్టాండర్డ్ కంటే కూడా 10 బిహెచ్‌పి పవర్,6.9 ఎన్ఎమ్ టార్క్‌ తగ్గుతుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో CNG వెర్షన్ కోసం 35.60km/kg ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇప్పటికే కొత్త సెలెరియో దేశంలో అత్యంత ఇంధన-సామర్థ్యం కలిగిన పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.

click me!