
Repo Rate : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి పేద, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. తాజాగా ఆర్బిఐ మానిటరీ పాలసీ మీటింగ్ జరిగింది… ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రెపో రేటును 0.50% తగ్గించారు… దీంతో ఇది 5.50%కి చేరుకుంది.
ఆర్బిఐ తాజా నిర్ణయంతో రాబోయే కాలంలో బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గవచ్చు… దీంతో ఈఎంఐ లు కూడా తగ్గుతాయి. ఇలా సామాన్యులపై ఆర్బిఐ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
అసలు ఈ రెపో రేటు తగ్గింపు అంటే ఏమిటి? చాలా సరళమైన భాషలో తెలుసుకుందాం. దీనివల్ల మీకు EMI ల నుండి ఎలా ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం.
రెపో రేటు అనేది RBI బ్యాంకులకు డబ్బును అప్పుగా ఇచ్చే రేటు. ఆర్బిఐ ఈ రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. అంటే తాజాగా రెపో రేట్ తగ్గించడం వలన మీ హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వడ్డీ తగ్గవచ్చు, మీ EMI కూడా తగ్గవచ్చు.
మీరు 20 లక్షల రూపాయల హోమ్ లోన్‌ను 7% వార్షిక వడ్డీ రేటుతో తీసుకున్నారని అనుకుందాం. ప్రస్తుతం మీ EMI దాదాపు 17,977 రూపాయలు ఉండవచ్చు. ఇప్పుడు వడ్డీ రేటు 0.50% తగ్గి 5.5% అయితే, మీ కొత్త EMI ఎంత ఉంటుంది? లెక్కించుకుందాం...
| రుణ మొత్తం | వడ్డీ రేటు | సంవత్సరాలు | EMI |
|---|---|---|---|
| ₹20,00,000 | 7.0% | 15 | ₹17,977 |
| ₹20,00,000 | 6.5% | 15 | ₹17,422 |
ఈ లెక్క ప్రకారం ప్రతి నెల మీ EMIపై 555 రూపాయల ఉపశమనం లభిస్తుంది. అంటే రెపో రేటు తగ్గింపువల్ల నెల నెలా కొంత డబ్బు ఆదా అవుతుంది. ఇది సంవత్సరానికి 6,660 రూపాయల ఆదా. 15 సంవత్సరాలలో ఈ ఆదా ఎంత పెద్దదిగా ఉంటుందో ఆలోచించండి.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 2025లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 6.5% నుండి 6.25%కి తగ్గించింది. ద్రవ్య విధాన కమిటీ (MPC) 5 సంవత్సరాల తర్వాత ఈ తగ్గింపు చేసింది. ఏప్రిల్ 2025లో వడ్డీ రేటు 0.25% తగ్గించబడింది, ఇప్పుడు మళ్ళీ రేట్లు తగ్గించబడ్డాయి. ఈ విధంగా మూడు సార్లు వడ్డీ రేటు 1% వరకు తగ్గించబడింది. ఈ సమావేశంలో RBI FY 26కి ద్రవ్యోల్బణ అంచనాను 4% నుండి 3.7%కి తగ్గించింది, GDP వృద్ధి అంచనాను 6.5% వద్ద ఉంచింది.