Electric Scooters: స్మార్ట్ ఫోన్ ధర కంటే తక్కువకే లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి విన్నారా?

Published : Jun 06, 2025, 10:45 AM IST
Electric Scooters: స్మార్ట్ ఫోన్ ధర కంటే తక్కువకే లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి విన్నారా?

సారాంశం

మీరు మంచి సెల్ ఫోన్ కొనుక్కొనే ధరకు చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చు. నమ్మశక్యంగా లేదా? ఈ స్కూటర్ల ధరలు తెలిస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. తక్కువ ధరలో, బెస్ట్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా పాపులర్ అయ్యాయి. పెట్రోల్ స్కూటర్ల కంటే ఇవి ధర తక్కువ. అంతేకాకుండా పర్యావరణానికి మంచివి కూడా. కాలుష్యం ఉండదు. తక్కువ మెయింటనెన్స్. ఇలా ఏవిధంగా చూసినా ఎలక్ట్రిక్ స్కూటర్లు బడ్జెట్ ఫ్రెండ్లీ. ముఖ్యంగా మధ్య తరగతి వారికి ఇవి చాలా అనుకూలంగా, అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి. 

అన్ని వయసుల వారు, పురుషులు, మహిళలు, పెద్దవాళ్లు కూడా ఈ స్కూటర్లను సులభంగా నడపవచ్చు. ఇంకా వీటిలో చాలా స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. వీటిని నడపడం, హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువ ధరలో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీలియో లిటిల్ గ్రేసీ

మీరు చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే జీలియో(Zelio Little Gracy) ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఓసారి పరిశీలించండి. ఈ స్కూటర్ డిజైన్ సింపుల్ గా, నడపడానికి చాలా వీలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది తక్కువ బరువుతో ఉంటుంది. కేవలం 80 కిలోల బరువున్న ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుండి 90 కి.మీ. వరకు నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఈ స్కూటర్ ధర రూ.49,500. అంటే మంచి స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ధరకే ఇది లభిస్తుందన్న మాట.

ఓలా S1 Z

ఈ ఓలా(Ola) స్కూటర్ 110 కిలోల బరువుతో వస్తుంది. ఈ స్కూటర్‌లో 1.5 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీలు ఉన్నాయి. ఇది 75 నుండి 146 కి.మీ. వరకు వెళ్తుంది. 110 కిలోల బరువున్న ఈ స్కూటర్ గంటకు 70 కి.మీ మాక్సిమం స్పీడ్ తో వెళ్తుంది. రోజువారీ అవసరాల కోసం ఈ స్కూటర్ బెస్ట్ సెలెక్షన్. ఈ స్కూటర్ ధర రూ.59,999. ఐఫోన్ లాంటి ఖరీదైన ఫోన్ కంటే ఈ స్కూటర్ ధరే తక్కువ అన్న మాట. 

ఏథర్ 450X

ఇండియాలో బాగా నమ్మకమైన బ్రాండ్ ఏథర్(Ather). ఈ స్కూటర్ కేవలం 108 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ట్రాఫిక్‌లో నడపడం ఈజీ. ఇందులో మంచి స్టోరేజ్ స్పేస్ ఉంది. ఏథర్ 450X 2.9 Kwh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. దీని బ్యాటరీ 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌లో 126 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.49 లక్షలు.

బజాజ్ చేతక్ 2903

దాని స్పెషల్ డిజైన్, ఫీచర్ల కారణంగా బజాజ్ ఆటో చేతక్(Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ బజాజ్ స్కూటర్‌లో 2.88 Kwh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌లో 123 కి.మీ. దూరం వెళ్తుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. ధర విషయానికొస్తే ఈ స్కూటర్‌ను రూ.1.02 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. స్కూటర్ బరువు 110 కిలోలు ఉంటుంది. అందువల్ల హ్యాండిల్ చేయడం ఈజీ.

టీవీఎస్ ఐక్యూబ్

టీవీఎస్ ఐక్యూబ్(TVS iQube) ఇండియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈ స్కూటర్ బేస్ మోడల్‌లో 2.2 Kwh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 75 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 110 కిలోల బరువున్న ఈ స్కూటర్ గంటకు 75 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీని బ్యాటరీ 3 గంటల్లోపే ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ ధర రూ.94,434.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి
మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు