డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ఆర్‌బి‌ఐ కొత్త పథకం...

Ashok Kumar   | Asianet News
Published : Aug 07, 2020, 06:23 PM ISTUpdated : Aug 07, 2020, 10:28 PM IST
డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ఆర్‌బి‌ఐ కొత్త పథకం...

సారాంశం

అధిక విలువ కలిగిన చెక్‌లతో మోసాలను నివారించడానికి పాజిటివ్ పే మెకానిజమ్‌ను ప్రకటించింది."ఈ విధానం ప్రకారం చెక్ జారీ చేసే సమయంలో కస్టమర్ పంపిన సమాచారం ఆధారంగా డ్రావీ బ్యాంక్ పేమెంట్ కోసం చెక్కులు ప్రాసెస్ చేయబడతాయి" అని ఆర్బిఐ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్ మెంట్లో పేర్కొంది.

మొబైల్ డివైజెస్, ఏ‌టి‌ఎం కార్డులను ఉపయోగించి ఆఫ్‌లైన్ పేమెంట్ పథకంతో సహా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం అనేక చర్యలను ప్రవేశపెట్టింది. అధిక విలువ కలిగిన చెక్‌లతో మోసాలను నివారించడానికి పాజిటివ్ పే మెకానిజమ్‌ను ప్రకటించింది.

"ఈ విధానం ప్రకారం చెక్ జారీ చేసే సమయంలో కస్టమర్ పంపిన సమాచారం ఆధారంగా డ్రావీ బ్యాంక్ పేమెంట్ కోసం చెక్కులు ప్రాసెస్ చేయబడతాయి" అని ఆర్బిఐ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్ మెంట్లో పేర్కొంది.

పాజిటివ్ పే మెకానిజమ్‌ వల్ల చెక్ పేమెంట్లలో కస్టమర్ భద్రతను మరింత పెంచుతుంది. చెక్ మోసలను తగ్గిస్తుందని ఆర్‌బిఐ తెలిపింది.

also read బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. గృహ, వ్యక్తిగత లోన్లపై వడ్డీ తగ్గింపు.. ...
 

ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులు
 డిజిటల్ చెల్లింపులలో గణనీయమైన వృద్ధి కనబరిచినప్పటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక సవాలుగా ఉందని పేర్కొన్న ఆర్బిఐ, వినియోగదారుల ఆసక్తిని కాపాడటానికి ఇన్ బిల్ట్ ఫీచర్స్ ఆఫ్-లైన్ మోడ్‌లో తక్కువ మొత్తం పేమెంట్ల కోసం పైలట్ పథకాన్ని అనుమతించాలని ప్రతిపాదించింది.

పైలట్ పథకం  మార్చి 31, 2021 వరకు చేపట్టబడుతుంది. కార్డులు, పర్సులు లేదా మొబైల్ డివైజెస్ లేదా మరేదైనా ఛానెల్ ఉపయోగించి బ్యాంకులు, నాన్ బ్యాంకులు పాల్గొనవచ్చు. ప్రతి లావాదేవీ 200 వరకు  అదనపు ఆతేంటికేషన్ లేకుండా పేమెంట్లు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ లావాదేవీల మొత్తం పరిమితి రూ.2,000, పేమెంట్ ఆపరేటర్లు వినియోగదారులకు రియల్ టైమ్ హెచ్చరికలను పంపాలి. పైలట్ పథకం ఆధారంగా, ఈ పథకం వివరాలు, మార్గదర్శకాలు తరువాత ప్రకటించబడతాయి.

"కార్డులు, పర్సులు, మొబైల్ డివైజెస్ ద్వారా ఆఫ్-లైన్ పేమెంట్ల ఆప్షన్ అందించడం డిజిటల్ పేమెంట్లను మరింతగా స్వీకరిస్తుందని భావిస్తున్నారు," ఇది ఆఫ్‌లైన్ పేమెంట్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Best Investment : బంగారం vs వెండి vs రాగి.. 2025లో ఏది కొంటే జాక్‌పాట్? నిపుణుల సీక్రెట్ ఇదే !
Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి