బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. గృహ, వ్యక్తిగత లోన్లపై వడ్డీ తగ్గింపు..

By Sandra Ashok KumarFirst Published Aug 7, 2020, 5:42 PM IST
Highlights

 రుణ  రేటు తగ్గింపు శుక్రవారం నుండి అమలులోకి వస్తుంది, అంటే ఆగస్టు 7, 2020 అని బ్యాంక్ వెబ్‌సైట్ లో తెలిపింది. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎమ్‌సిఎల్‌ఆర్‌ను రుణాలపై 20 బిపిఎస్ తగ్గించింది. 

దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రుణ రేటు (ఎంసిఎల్‌ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది. రుణ  రేటు తగ్గింపు శుక్రవారం నుండి అమలులోకి వస్తుంది, అంటే ఆగస్టు 7, 2020 అని బ్యాంక్ వెబ్‌సైట్ లో తెలిపింది.

గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎమ్‌సిఎల్‌ఆర్‌ను రుణాలపై 20 బిపిఎస్ తగ్గించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాల ఈ‌ఎం‌ఐ 0.10 శాతం తగ్గుతుంది.

తాజా రేటు తగ్గింపు తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం దాని ఎంసిఎల్‌ఆర్ 7 శాతానికి తగ్గాయి. వినియోగదారు రుణాలకు అనుసంధానించిన ఒక సంవత్సరం ఎంసిఎల్ఆర్ ఇప్పుడు 7.35 శాతంగా ఉంటుంది,

also read 

మూడేళ్ల ఎంసిఎల్ఆర్ 7.55 శాతంగా నిర్ణయించింది. బ్యాంకులు సాధారణంగా ప్రతి నెల తమ ఎంసిఎల్‌ఆర్‌ను సమీక్షిస్తాయి. కీలకమైన రేట్లు (రెపో, రివర్స్ రెపో రేట్లు) మారకుండా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కాకుండా ఇతర రుణదాతలు కూడా ఎంసిఎల్‌ఆర్ తగ్గింపును ప్రకటించారు. ఆర్‌బిఐ ద్రవ్య విధాన ప్రకటన పిఎస్‌యు రుణదాత అయిన కెనరా బ్యాంక్ గురువారం ఎంసిఎల్‌ఆర్‌ను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు ప్రకటించింది.

మూడు నెలల ఎంసిఎల్‌ఆర్‌ను 7.45 శాతం నుంచి 7.15 శాతానికి  కెనరా బ్యాంక్ సవరించింది. ఆగస్టు 4, మంగళవారం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

యూనియన్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం, నెలజీతం అందుకునే ఉద్యోగులకు 30 లక్షల వరకు గృహ రుణాలపై 6.7 శాతం వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
 

click me!