కస్టమర్లకు ఎస్‌బీఐ వార్నింగ్.. వాటిపై క్లిక్ చేయొద్దు అంటూ హెచ్చరిక..

By Sandra Ashok KumarFirst Published Aug 7, 2020, 1:25 PM IST
Highlights

"భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సైబర్ దాడులు ఎక్కువ జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది" అన్నారు. ఉచిత కోవిడ్-19 టెస్టింగ్ అంటూ Ncov2019@gov.in నుండి వచ్చే ఇమెయిళ్ళపై దయచేసి క్లిక్ చేయకండి అంటూ హెచ్చరిస్తు ఒక ట్వీట్‌ ద్వారా తెలిపింది.

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైబర్ దాడిలతో  బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త వహించాలని కోరుతూ ఒక హెచ్చరికను జారీ చేసింది. "భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సైబర్ దాడులు ఎక్కువ జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది" అన్నారు.

ఉచిత కోవిడ్-19 టెస్టింగ్ అంటూ Ncov2019@gov.in నుండి వచ్చే ఇమెయిళ్ళపై దయచేసి క్లిక్ చేయకండి అంటూ హెచ్చరిస్తు ఒక ట్వీట్‌ ద్వారా తెలిపింది. "సైబర్ నేరస్థులు 2 మిలియన్ల వ్యక్తిగత / సిటిజెన్  ఇమెయిల్ ఐడిలను కలిగి ఉన్నారని, 'ఉచిత కోవిడ్ -19 టెస్టింగ్' అనే పేరుతో ఈమెయిల్స్ పంపుతున్నారని ఎస్‌బిఐ హెచ్చరించింది.  

సెంటర్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి-ఇన్) "హానికరమైన కోవిడ్-19 సంబంధిత ఫిషింగ్ అటాక్ క్యాంపెయిన్" పై సలహా ఇచ్చిన కొద్ది రోజులకే ఎస్‌బి‌ఐ హెచ్చరిక జారిచేసింది. కోవిడ్-19 సంబంధిత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడానికి పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, వాణిజ్య సంఘాలు అంటూ వ్యవహరిస్తారు వారిపట్ల జాగ్రతగా ఉండాలని తెలిపింది.

also read 

వారు ncov2019 [@] gov.in లాగా కనిపించే ఇమెయిల్ చిరునామాలను  సృష్టిస్తారు. ఈ ఇమెయిళ్ళలోని లింక్‌లపై క్లిక్ చేస్తే నకిలీ వెబ్‌సైట్‌లకు తీసుకువెళ్తుంది, అక్కడ వారు హానికరమైన ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం లేదా వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని నమోదు చేయడం వంటివి చేస్తే మీరు మోసపోవచ్చు.

కోవిడ్ -19 వ్యాప్తి వల్ల ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరిగినందున సైబర్ మోసగాళ్ళు ఈ విధంగా కొత్త రకం మోసాలపై కన్నెశారు. ఉద్యోగులు వారి సొంత ప్రాంతాల నుండి పనిచేయడానికి చాలా కంపెనీలు పనులను ఆన్‌లైన్‌ పద్దతిలోకి మార్చాయి. ఎవరూ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని తెలిపింది.

అంతేకాకుండా ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యేటప్పుడు.. అది సురక్షితమా.? కాదా.? అనేది చూసుకోవాలని చెప్పింది. వెబ్‌సైట్‌ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు యూఆర్ఎల్ https:// నుంచి ప్రారంభమవుతుందో.. లేదో చూసుకోవాలంది. అటు ఫోన్ ద్వారా బ్యాంక్ వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు గానీ ఎవరైనా అడిగితే చెప్పొద్దని పేర్కొంది.

click me!