Petrol diesel Price Today: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌, ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

By team teluguFirst Published Nov 4, 2021, 12:12 PM IST
Highlights

దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్ పై రూ. 5, లీటరు డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. దీంతో ఇంధన ధరలు తగ్గాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు (Petrol diesel Price Today) ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 

దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. దేశంలో కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 120కి చేరగా, కొన్ని మెట్రో నగరాల్లో లీటర్ డీజిల్ ధర రూ. 100 దాటింది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని వ్యాట్ రాష్ట్రాలు చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే తాజాగా పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. లీటరు పెట్రోల్ పై రూ. 5, లీటరు డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. నేటి(నవంబర్ 4) నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టుగా తెలిపింది. 

మరోవైపు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ పాలిత.. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలలో అదనపు తగ్గింపులను ప్రకటించాయి. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాట, గోవా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తగ్గింపుతో పాటు లీటర్‌కు రూ. 7 అదనంగా తగ్గించాయి.

Also read: Petrol , Diesel Price Cut: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

గురువారం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 6.33 తగ్గి.. రూ. 108.18గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 12.79 తగ్గి రూ. 94.61గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో లీటరు పెట్రోల్ ధర రూ.110.67కు,  డీజిల్ ధర రూ.96.08కు తగ్గింది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు (Petrol diesel Price Today) ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోల్ రూ. 103.97, డీజిల్ రూ. 86.87కి తగ్గింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.40కి తగ్గింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ రేట్లు మరింత తక్కువగా ఉండనున్నాయి. 

Also read: Fuel Rates: పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు తగ్గింపులు ప్రకటించిన 9 రాష్ట్రాలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 98కే..

నేడు లీటర్ పెట్రోల్ ధర ముంబైలో రూ. 109.98, చెన్నై రూ. 101.40, కోల్‌కత్తా రూ. 104.67, ఢిల్లీ రూ. 103.97, హైదరాబాద్‌లో రూ. 108.18 గా ఉన్నాయి. అదే విధంగా లీటర్ డీజిల్ ధర ముంబైలో రూ. 94.14, చెన్నై రూ. 91.43, కోల్‌కత్తా రూ. 89.79, ఢిల్లీ రూ. 86.67, హైదరాబాద్‌లో రూ. 94.61 గా ఉన్నాయి. 

click me!