ఫేస్ బుక్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై ఫేస్ రికగ్నైజేషన్ ఉండదు...

By AN TeluguFirst Published Nov 3, 2021, 8:08 AM IST
Highlights

ఫేస్బుక్లో దీన్ని ఉపయోగిస్తున్న వారు ఇక భవిష్యత్తులో ఈ సాంకేతికతను ఉపయోగించలేరు.  ముఖ గుర్తింపు కోసం ఉపయోగించే Templateలను తొలగించనున్నాం... అని తన బ్లాగులో ఆయన పేర్కొన్నారు. 

అమెరికా :  వ్యక్తిగత గోప్యత పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో దిగ్గజ సామాజిక మాద్యమం ఫేస్బుక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  ఫేస్బుక్లో ఫేషియల్ రికగ్నైజేషన్  ను తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.  ఫేస్ ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్బుక్ కంపెనీ మాతృసంస్థ ‘మెటా’ తెలిపింది. 

Facial recognition technologyలో ఇదొక భారీ మార్పు అని ఫేస్బుక్ మాతృసంస్థ ‘meta’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వైస్ ప్రెసిడెంట్ జెరోమ్  పేసెంటి తెలిపారు. విస్తృత వినియోగం నుంచి పరిమిత వినియోగానికి కుదించడానికి ఫేస్బుక్లో ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను మేము తొలగించనున్నాం.

ఫేస్బుక్లో దీన్ని ఉపయోగిస్తున్న వారు ఇక భవిష్యత్తులో ఈ సాంకేతికతను ఉపయోగించలేరు.  ముఖ గుర్తింపు కోసం ఉపయోగించే Templateలను తొలగించనున్నాం... అని తన బ్లాగులో ఆయన పేర్కొన్నారు. 

పెరుగుతున్న సామాజిక ఆందోళనలకు వ్యతిరేకంగా బ్యాలెన్స్ చేసేందుకు ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను ఫేస్బుక్ 2010 లో తీసుకు వచ్చింది.  

ఫేస్బుక్ వాడుతున్న  వారిలో   మూడు వంతుల మంది  ఫేషియల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను తొలగించడం వల్ల ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ప్రభావితం కానున్నారు.

ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ఆటోమేటిక్ ఆల్ టెక్స్ట్ (ఏఏటీ)పై దీని ప్రభావం పడనుంది. యూజర్ల ఖాతాల్లోని వ్యక్తిగత ముఖ గుర్తింపు టెంప్లేట్లు తొలగిపోనున్నాయి.  ఫోటోలు వీడియోలోని ముఖాలను ఫేస్బుక్ దానంతట అది గుర్తించది.  ఫోటోలోని వ్యక్తిని సూచించడానికి, వారి పేరుతో Tag చేయడానికి ఇక కుదరదు. 

ఇక ఫోటోలోని వ్యక్తులను ఇతరులు గుర్తించకుండా సాధ్యపడుతుంది.  వ్యక్తిగత కు సంబంధించి ఫేస్బుక్ లో ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతతో ప్రమాదం పొంచి ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.  

అయితే దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలు దీన్ని వినియోగాన్ని  నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియ లో ఉన్నట్లు ‘మెటా’ తెలిపింది. అయితే ఈ మార్పులు ఈ నెలలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

బ్యాంకుల నుండి వాట్సాప్ వరకు మారనున్న రూల్స్ ఇవే.. నేటి నుంచి అమలులోకి..

గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ వ్యక్తిగత గోప్యతపై తరచూ Criticism పాలవుతోంది.  పలు దేశాల్లో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది.  ఇటీవల కంపెనీ మాజీ ఉద్యోగి Facebook documents leak చేయడంతో ఫేస్బుక్ మాతృ సంస్థకు కష్టాలు ఎక్కువ అయ్యాయి. 

పేరు మార్చుకున్న ఫేస్ బుక్...
‘ఫేస్ బుక్’ కంపెనీ పేరు మారింది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఈ మేరకు పేరు మార్పు విషయాన్ని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గురువారం వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతిక (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఫేస్ బుక్ కంపెనీ అధీనంలోని social media platforms అయిన face book, instagram, watsapp ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృసంస్థ పేరును మాత్రమే మార్చారు. ప్రజలు వర్చువల్ విధానంలో కలుసుకుని, పనిచేసి, ఉత్పత్తులను తయారు చేసే సరికొత్త వేదికగా మెటావర్స్ ను Mark Zugerberg చెబుతున్నారు. 

రానున్న దశాబ్దంలో వంద కోట్లమందికి ఈ వేదిక అందుబాటులోకి వస్తుందని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సామాజిక మాధ్యమంలో ఇన్ స్టా గ్రాం, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్ సెట్, హొరైజన్ వీఆర్ వంటివ భాగంగా ఉన్నాయని.. వాటన్నింటినీ ‘ఫేస్ బుక్’ అనే పేరు దర్పణం పట్టడం లేదని చెప్పారు. 

click me!