Petrol , Diesel Price Cut: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

By Siva Kodati  |  First Published Nov 3, 2021, 8:28 PM IST

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. పెట్రోల్‌పై 5 శాతం, డీజిల్‌పై 10 శాతం ఎక్స్‌జ్ సుంకాన్ని తగ్గించింది. రేపటి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం చెప్పిన శుభవార్తగానే దానిని భావించాలి.


పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. పెట్రోల్‌పై 5 శాతం, డీజిల్‌పై 10 శాతం ఎక్స్‌జ్ సుంకాన్ని తగ్గించింది. రేపటి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం చెప్పిన శుభవార్తగానే దానిని భావించాలి. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతువన్న సంగతి తెలిసిందే. 

Also Read:పెట్రోల్ రూటు సేప'రేటు'.. మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు..

Latest Videos

గత ఏడాది అక్టోబర్‌లో పెట్రోల్‌ డిమాండ్‌ 3.9 శాతం పెరగ్గా, డీజిల్‌ 5.1 శాతం క్షీణించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. రోజువారీ ధరల విధానం ప్రకారం, OMCలు ఆటో ఇంధనాల రిటైల్ ధరలను రోజువారీగా సవరిస్తాయి. అదనంగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు బ్రెంట్ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి, ఎందుకంటే భారతదేశం ఇంధన అవసరాలలో 82 శాతం దిగుమతి చేసుకుంటుంది.

VAT (విలువ ఆధారిత పన్ను), సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల బట్టి ఆటో ఇంధన ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. పెట్రోల్ పంపు ధరలో 61 శాతానికి పైగా, డీజిల్‌ ధరపై 56 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటుందని గమనించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది.

click me!