Paytm offer: పేటీఎం వాడే వారికి గుడ్ న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ. 60 వేలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 28, 2022, 09:55 AM IST
Paytm offer: పేటీఎం వాడే వారికి గుడ్ న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ. 60 వేలు..!

సారాంశం

పేటీఎం వాడే వారికి శుభ‌వార్త‌. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ కంపెనీ పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఉపయోగించే వారికి ప్రయోజనం కలగనుంది. 

పేటీఎం వాడే వారికి శుభ‌వార్త‌. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ కంపెనీ పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఉపయోగించే వారికి ప్రయోజనం కలగనుంది. ఇన్‌స్టంట్ క్రెడిట్ లిమిట్‌ను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పేటీఎం తన పోస్ట్ పెయిడ్ సేవల రూపంలో కస్టమర్లకు లెండింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే.

కస్టమర్లు పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా స్మాల్ టికెట్ ఇన్‌స్టంట్ లోన్స్ పొందొచ్చు. ఇంటి ఖర్చుల కోసం ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. స్టోర్లలో షాపింగ్ చేయొచ్చు. లేదంటే పేటీఎం ద్వారా ఆన్‌లైన్ కొనుగోళ్లు నిర్వహించొచ్చు. ఈ సేవల కోసం పేటీఎం ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో జతకట్టింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ కింద కస్టమర్లు రూ.60 వేల వరకు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు. దీన్ని ద్వారా షాపింగ్ లేదా స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఈ డబ్బులకు ఎలాంటి వడ్డీ పడదు. అయితే 30 రోజులలోగా మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పోస్ట్ పెయిడ్ సర్వీసుల యాక్టివేషన్ కోసం పేటీఎం ఎలాంటి వార్షిక, యాక్టివేషన్ చార్జీలను వసూలు చేయడం లేదు. అయితే కన్వీనియన్స్ ఫీజు మాత్రం స్వల్పంగా ఉంటుంది.

పోస్ట్ పెయిడ్ సర్వీసుల కింద ఉపయోగించుకున్న డబ్బులను నెల రోజుల్లో చెల్లించలేకపోతే మాత్రం అప్పుడు చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించుకోవాలి. కరెక్ట్ టైమ్‌కు డబ్బులు చెల్లించగలమని భావించే వారు ఈ పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. చేతికి డబ్బులు వచ్చిన తర్వాత నెల చివరిలో ఒకసారి బిల్లు క్లియర్ చేస్తే సరిపోతుంది.


పేటీఎం పోస్ట్ పెయిడ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాంటే..?

- ముందుగా పేటీఎం యాప్‌లోకి వెళ్లాలి. తర్వాత అక్కడ మీకు మై పేటీఎం అనే సెక్షన్‌లో పేటీఎం పోస్ట్ పెయిడ్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.

- ఒకవేళ మీకు కనిపించకపోతే సెర్చ్ బార్‌లో పేటీఎం పోస్ట్ పెయిడ్ అని టైమ్ చేయండి. అప్పుడు మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

- పేటీఎం పోస్ట్ పెయిడ్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

- డిజిటల్ కేవైసీ ప్రాసెస్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే మీ క్రెడిట్ లిమిట్ ఎంతో తెలిసిపోతుంది.

- తర్వాత మీ క్రెడిట్ లిమిట్‌ను ఓకే చేస్తే సరిపోతుంది. మీ పేటీఎం పోస్ట్ పెయిడ్ యాక్టివేట్ అయిపోతుంది.

- ఇక్కడ యూజర్ ప్రాతిపదికన క్రెడిట్ లిమిట్ మారుతుంది. గరిష్టంగా రూ.60 వేల వరకు లిమిట్ వస్తుంది. కొందరికి తక్కువే రావొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కోలా లిమిట్ వస్తుందని గుర్తించుకోవాలి.

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్