
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా తగ్గుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఇక తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పడితే, వెండి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం (ఫిబ్రవరి 28)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
దేశీయంగా బంగారం ధరలు తగ్గితే, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,300గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,100గా ఉంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,00 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో వెండి ధర రూ. 69,000గా ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది.