
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భగ్గుమంటున్నాయి. ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. 5 శాతం మేర ర్యాలీ చేశాయి. కానీ దేశీ మార్కెట్‌లో పెట్రోల్ ధర నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే ఉంది. దీంతో నేడు (ఫిబ్రవరి 28, 2022) కూడా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి మార్పు లేకుండా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి సోమవారం కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.
వివిధ నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67
- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79
- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.65, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.75
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62
- విశాఖపట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18
- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01
- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర లీటర్ కు రూ. 90.70
- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.88
- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 102.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 90.60
- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. క్రూడ్ ధరలు మళ్లీ 100 డాలర్ల సమీపంలోకి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 5.14 శాతం ఎగసింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 99.37 డాలర్లకు చేరింది. అదేసమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 5.33 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 96.93 డాలర్లకు ఎగసింది.
కాగా భారత్.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.