ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు అనుసంధానం చేయకుంటే సదరు వ్యక్తులకు కష్టాలు మొదలైనట్లే. ఈ నెల 31వ తేదీ లోగా అనుసంధానించుకోవాలని ఇప్పటికే ఆదాయం పన్నుశాఖ తెలిపింది. ఆ తర్వాత వాడితే రూ.10 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను వినియోగిస్తే రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయం పన్ను శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెలాఖరుతో ఆధార్‌తో లింక్ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇది వరకే ఆదాయం పన్ను శాఖ వెల్లడించింది.
అలాగే గడువు తేదీలోపు పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానించుకోని వినియోగదారులపై ఆదాయంపన్ను చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తప్పవని తెలిపింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం రద్దైన పాన్ కార్డు వాడిన వారికి రూ. 10 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.
undefined
also read ఓలా & ఉబెర్ క్యాబ్ సర్వీసులకు చెక్... క్యాబ్ అగ్రిగేటర్‌గా మహీంద్రా
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం 2017 జూలై ఒకటో తేదీకి ముందు కార్డు పొందిన వ్యక్తి కచ్చితంగా తన ఆధార్ నంబర్‌ను ఐటీశాఖ అధికారులకు తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ నెలాఖరును గడువు తేదీ విధించిన ఐటీశాఖ, ఏప్రిల్ ఒకటినుంచి అలాంటి పాన్‌కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ప్రకటనలో తెలిపింది.
పాన్‌కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తే మాత్రం ఆర్థిక, బ్యాంకింగు, ప్రాపర్టీ కొనుగోలు-అమ్మకాలు, స్టాక్ మార్కెట్ల లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీని గడువును పలుమార్లు పొడగించిన ఐటీశాఖ..ఈసారి మాత్రం గడువుతేదీ పొడగించే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇప్పటికీ చాలా మంది ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయని వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. తాజా డెడ్‌లైన్‌లోగా ఈ రెండింటినీ లింక్ చేసుకోవాల్సి ఉండగా వీటి అనుసంధానానికి అవసరమైన దశలను చూద్దాం. ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవడం సులభమే. అయితే కొన్ని సందర్భాల్లో రెండు అనుసంధానం కాకపోవచ్చు.
ఆధార్, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉన్నా కూడా రెండు లింక్ కావు. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తే, పాన్ కార్డును ఆదాయం పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే అప్పుడు ఆధార్, పాన్ కార్డుల్లో వివరాలను సరిచేయాలి.
ఆధార్ కార్డులో తప్పుగా ఉన్న పేరును మార్చుకునేందుకు https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆదాయ పన్నుశాఖ వెబ్‌సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లో పాన్ వివరాలను సరిచేసుకోవచ్చు.
also read ఐటీ రంగంలో భారీగా కొత్త ఉద్యోగావకాశాలు...దాదాపు లక్ష వరకు...
వివరాలు ఏమీ తప్పుగా లేకపోతే ఆన్‌లైన్, ఎస్ఎంఎస్, పాన్ కేంద్రాల్లో రెండింటిని లింక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా 567678 లేదా 56161 నెంబర్‌కు యూఐడీపాన్ 12 అంకెల ఆధార్ పది అంకెల పాన్ నెంబర్‌ను ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా పాన్ ఆధార్ లింకేజ్‌ను పూర్తిచేయవచ్చు.
ఇక నేరుగా ఆదాయం పన్ను శాఖ వెబ్‌సైట్ www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి పాన్ (యూజర్ ఐడీ), పాస్‌వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ప్రొఫైల్ సెట్టింగ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ పాన్ ఆధార్ నెంబర్‌తో లింక్ అయినట్టు మెసేజ్ కనిపంచకుంటే అక్కడ కనిపించే ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. ఒకసారి మీ వివరాలు సబ్‌మిట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది.
అయితే, గడువుతేదీ ముగిసిన అనంతరం కూడా పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే వీలుంది. ఆధార్ లింక్ చేసినప్పటినుంచి తిరిగి అదే పాన్‌కార్డును పనిచేసేదిగా పరిగణిస్తారు.