హైదరాబాద్‌లో కొత్త స్కూటర్ రెంట్ సర్విస్...1.కి.మీ రూపాయి...

By Sandra Ashok KumarFirst Published Dec 18, 2019, 3:54 PM IST
Highlights

హైదరాబాద్‌లో స్కూటర్ రెంట్ సర్విస్ ను తెలంగాణ ఐటి అండ్ ఇండస్ట్రీస్ విభాగం, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం ఇచ్చింది అలాగే 2020 జూన్ నాటికి నగరంలో 10,000 స్కూటర్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.

హైదరాబాద్: బెంగళూరుకు చెందిన బౌన్స్ కంపెనీ  డాక్ లెస్ స్కూటర్ రెంట్ సర్విస్ ని భారతదేశంలోని మరో 10 నగరాల్లోకి ప్రవేశించింది. వచ్చే ఏడాదిలో రోజుకు ఒక మిలియన్ రైడ్ల టార్గెట్ ను కవర్ చేయాలని చూస్తోంది.హైదరాబాద్‌లో 2 వేల స్కూటర్లతో ఈ సర్విస్ ను ప్రారంభించిన సంస్థ గత ఏడాది కాలంగా బెంగళూరులో స్కూటర్ రెంట్ సర్విస్ ని  అందిస్తోంది. 

స్కూటర్ రెంట్  ప్లాట్‌ఫాంలో తమ సర్విస్లను ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నగరాలకు విస్తరింపజేయాలని, రాబోయే కొద్ది నెలల్లో మంచి లాభాలను కూడా సాధించాలని సంస్థ చూస్తోంది. హైదరాబాద్‌లో  స్కూటర్ రెంట్ సర్విస్ ను తెలంగాణ ఐటి అండ్ ఇండస్ట్రీస్ విభాగం, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం ఇచ్చింది. 2020 జూన్ నాటికి నగరంలో 10,000 స్కూటర్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.

also read జొమాటో కొత్త ఆఫర్.. లేటైతే పుడ్ ఫ్రీ!

బౌన్స్ సంస్థ పేటెంట్ కీలెస్ టెక్నాలజీ ద్వారా ప్రారంభించిన డాక్ లెస్ ఫీచర్ వినియోగదారుని సమీప ప్రదేశం నుండి బైక్ బుక్ చేసుకొని తర్వాత ఏదైనా లీగల్ పార్కింగ్ జోన్ వద్ద రైడ్ ని క్లోజ్ చేసుకోవచ్చు. రైడర్స్ కిలోమీటరుకు 1 రూపాయి అలాగే నిమిషానికి 1.7 రూపాయల రెంట్ చార్జ్ ని చెల్లించాలి. 

బౌన్స్ కంపెనీ ఇటీవల జూలైలో 72 మిలియన్లను సేకరించింది. సంస్థలో మొత్తం పెట్టుబడి $ 100 మిలియన్లు. జూన్ 2020 నాటికి హైదరాబాద్‌లో 8వేల బైక్‌లతో రోజుకు 1,00,000 రైడ్‌లను పూర్తి చేయాలని, ఇంకా 2,000 ఉద్యోగాలను కల్పించేల మేము ప్లాన్ చేస్తున్నాము ”అని బౌన్స్ సిటిఓ, సహ వ్యవస్థాపకుడు వరుణ్ అగ్ని అన్నారు.

హెల్మెట్లు, టిల్ట్ ఇంకా టోవ్ సెన్సార్ల వంటి కొత్త టెక్ సొల్యూషన్స్‌తో స్కూటర్లు ప్రారంభించారు. జిపిఎస్ ట్యాగింగ్, జియో-ఫెన్సింగ్,  క్రాష్ సెన్సార్లు, బ్యాటరీ ట్యాంపరింగ్ ఏదైనా జరిగిన బౌన్స్ టీమ్ అలెర్ట్ చేస్తాయి.

also read  జోమాటో చేతికి ఉబర్ ఈట్స్..! స్వీగ్గి పై డైరెక్ట్ వార్..


గేర్‌లెస్ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి బౌన్స్ కంపెనీ టీవీఎస్, హోండాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వాటిని బెంగళూరు, హైదరాబాద్‌లోని తమ యూనిట్లలో కస్టమైజ్ చేస్తారు. ప్రస్తుతం నగరంలోని స్కూటర్లను రెట్రోఫిట్ చేయడానికి బౌన్స్ మరో మూడు యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది. హైదరాబాద్ కార్యకలాపాల కోసం టివిఎస్ నుండి నెలకు సగటున 1,500 వాహనాలను ఆర్డర్ చేసింది.


ఎలక్ట్రోనిక్ వాహనాల విషయానికొస్తే స్టార్టప్ వాహనాలను అందించడానికి ఎలక్ట్రోనిక్ వాహనాల తయారీదారులతో చర్చలు జరుపుతోంది . ఇది ప్రస్తుతం ఉన్న కొన్ని పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రోనిక్ వాహనాలకు మార్చనుంది. భవిష్యత్తులో స్వంత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేయాలని ఆలోచిస్తుంది దీనిపై మా బృందం పరిశోధనలు కూడా చేస్తోందన్నారు.
 

click me!