Latest Videos

పేద జంటలకు పెళ్లిళ్లు.. అంబానీ ఫ్యామిలి గిఫ్ట్ గా ఏమిచ్చిందో తెలుసా?

By Ashok KumarFirst Published Jul 2, 2024, 8:13 PM IST
Highlights

Ambani Family Wedding Celebrations : ముకేశ్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ మహారాష్ట్రలోని ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్‌కు చెందిన 50 మందికి పైగా నిరుపేద జంటలకు సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. రాధికా మర్చంట్‌తో వారి కుమారుడు అనంత్ అంబానీ ఈ పెళ్లి కార్యక్రమాలను ప్రారంభించారు.

Ambani Family Wedding Celebrations : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళికి  ముందు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గ్రాండ్ గా కమ్యూనిటీ వెడ్డింగ్‌ నిర్వహించారు. పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకలు జరిగాయి. ముకేశ్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ మహారాష్ట్రలోని ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్‌కు చెందిన 50 మందికి పైగా నిరుపేద జంటలకు సామూహిక వివాహం నిర్వహించారు. రాధికా మర్చంట్‌తో వారి కుమారుడు అనంత్ అంబానీ ఈ పెళ్లి  కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సామూహిక వివాహ కార్యక్రమంతో అనంత్ - రాధికల శుభ ముహూర్తం వేడుకలు ప్రారంభమవుతాయని నీతా అంబానీ తెలిపారు. అంబానీలతో పాటు వారి కుమారుడు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా అంబానీ, రిలయన్స్ రిటైల్‌కు అధిపతి అయిన కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్‌తో సహా వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

అంబానీ కుటుంబం నిర్వహించిన ఈ 'సామూహిక్ వివాహ్' కార్యక్రమం రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగింది. ఈ జంటల కుటుంబాలతో పాటు దాదాపు 800 మందితో పాటు స్థానిక సామాజిక కార్యకర్తలు ఇంకా సంఘం సభ్యులు హాజరయ్యారు. ఈ సామూహిక పెళ్లిల వేడుక తరువాత, ఇక్కడికి హాజరైన వారందరికీ గొప్ప విందు ఏర్పాటు చేసారు. ఈ ఫంక్షన్‌ ప్రారంభంతో రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇలాంటి వందలాది వివాహాలకు సపోర్ట్ చేస్తూనే ఉంటామని అంబానీ ఫ్యామిలీ ప్రకటించింది. 

దంపతులకు బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.1.01 లక్షల చెక్

ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో భాగమైన నిరుపేద జంటలకు భారీ కానుకలు అందించింది అంబానీ ఫ్యామిలీ. ప్రతి జంటకు మంగళసూత్రం, పెళ్లి ఉంగరాలు, ముక్కుపుడకలతో సహా బంగారు ఆభరణాలు అందజేశారు. కాలికి మెట్టలు వంటి వెండి ఆభరణాలను కూడా ఇచ్చారు. ఇవి కాకుండా ప్రతి వధువుకు రూ. 1.01 లక్షల (లక్ష వేయి రూపాయలు) చెక్కును అందించారు. అలాగే, ప్రతి జంటకు ఒక సంవత్సరానికి సరిపడా కిరాణా సామాగ్రి, గృహోపకరణాలు బహుమానంగా అందించారు. ఇందులో వివిధ రకాలైన 36 నిత్యావసర వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్ ఇంకా  ఫ్యాన్ వంటి ఉపకరణాలతో పాటు పరుపు, దిండ్లు ఉన్నాయి.

కాగా, అనంత్ అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ పెళ్లి జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. జూలై 12వ తేదీ శుక్రవారం శుభ కళ్యాణంతో ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించాలని సూచించారు. జూలై 13, శనివారం శుభ్ ఆశీర్వాదంతో వేడుకలు కొనసాగుతాయి అలాగే  చివరి ఈవెంట్, మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జూలై 14 ఆదివారం ఉండనుంది. ఈ సందర్భంగా అతిథులు 'ఇండియన్ చిక్' దుస్తులను ధరించవలసిందిగా కోరారు.

click me!