వారసుడొచ్చాడు...రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి ఎంట్రీ..

By Sandra Ashok Kumar  |  First Published May 26, 2020, 4:06 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫాంలు, ఫేస్ బుక్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ వంటివి పెట్టుబడి పెట్టనున్నట్లు విషయం తెలిసిందే. కానీ తెలియని మరో విషయం ఏంటంటే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆరంగేట్రం చేశాడు. 


రిలయన్స్ జియోకు సంబంధించిన మరో  కీలక అంశం వార్తలలో హల్ చల్ చేస్తున్నాయి. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా 25 ఏళ్ల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు తొలిసారి ప్రవేశించాడు.  ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కంటే వారం ముందు అతని నియామకం జరిగింది అని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫాంలు, ఫేస్ బుక్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ వంటివి పెట్టుబడి పెట్టనున్నట్లు విషయం తెలిసిందే. కానీ తెలియని మరో విషయం ఏంటంటే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆరంగేట్రం చేశాడు. దీనికి సంబంధించి రిలయన్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం.

Latest Videos

జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా 25 ఏళ్ల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు తొలిసారి ప్రవేశించాడు.  ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కంటే వారం ముందు ఇది జరిగిందని వర్గాలు చెబుతున్నాయి

అనంత్ తనయులు ఆకాష్, ఇషా ఇద్దరూ నూతన యుగ వ్యాపారాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.2014 లో, ఆర్‌ఐ‌ఎల్  టెలికాం, రిటైల్ వ్యాపారాల బోర్డులలో ఇషా, ఆకాష్ లను డైరెక్టర్లుగా నియమించారు. ఐపిఎల్ మ్యాచ్‌లలో అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్‌ క్రికెట్ జట్టుతో అనంత అంబానీ కనిపించాడు.

also read ఆ చైనా కంపెనీలపై ఆంక్షల కొరడా: అవి ‘నిఘా‘ సంస్థలని అమెరికా మండిపాటు..

 
గత ఒకటిన్నర సంవత్సరాల్లో, క్రమంగా పెద్ద.పెద్ద బాధ్యతలను అనంత్ కు అప్పగించనున్నారు. ఐదు నెలల క్రితం అనంత్ అంబానీ తాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా ఆయన ఒక ఉపన్యాసం కూడా ఇచ్చాడు.

రిలయన్స్ కుటుంబానికి సేవ చేయడమే తన జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యం అని అనంత్ చెప్పాడు. "మార్పు కోసం  భారతదేశం నాయకత్వం వహించాలి, ఆ మార్పులో రిలయన్స్  ముందంజలో ఉండాలి" అని ఆయన అన్నారు. గత సంవత్సరం, మహారాష్ట్ర వరద సహాయ పనుల కోసం రూ .5 కోట్ల చెక్కును అప్పగించడానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కూడా కలిశాడు.

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన అనంత్ అంబానీ రోడ్ ఐలాండ్ లోని బ్రౌన్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అతను సరైన వయస్సులో ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి సరైన వేదిక ఉందని సన్నీహితవర్గాలు భావిస్తున్నాయి.  


జియో ప్లాట్‌ఫారమ్‌లలో పెరుగుతున్న వ్యాపారం విలువ భవిష్యత్తు సామర్థ్యాన్ని చూపుతుంది. ప్రస్తుతం కంపెనీ ఈక్విటీ విలువ పరంగా రూ .4.91 లక్షల కోట్లకు పైగా, ఎంటర్ప్రైజ్ విలువలో రూ .5.16 లక్షల కోట్లకు పైగా ఉంది. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ వంటి సంస్థలు జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపాయి.

click me!