అలీబాబాను వెనక్కినెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేశ్

By sivanagaprasad KodatiFirst Published Dec 25, 2018, 7:50 AM IST
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో ఘనతను అందుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో ఘనతను అందుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు.

వార్షికంగా ఆసియాలోని మిగిలిన సంపన్నుల సంపద కరిగిపోతున్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్తుండటంతో ముఖేశ్ సంపద సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగి సుమారు 43.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇదే క్రమంలో చైనాకి చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చీఫ్ ‘‘జాక్ మా’’’ సంపద 35 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం 2018లో ఆసియాకు చెందిన 128 మంది కుబేరుల సంపద 137 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది.

చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం, షేర్ల విలువలు, ఇందుకు కారణమయ్యాయి. ఇక ఈ జాబితాలో భారత్‌కు చెందిన కుబేరులు 23 మంది స్థానం పొందారు. వారి సంపద 21 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. చైనాకు చెందిన 40 మంది సంపన్నుల్లో మూడింట రెండొంతుల మంది సంపద ఆవిరైనట్లు బ్లూమ్ బర్గ్ పేర్కొంది.

click me!