దుబాయ్ కేంద్రంగా పనిచేసే లులు గ్రూప్ రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలంగాణలో దాదాపు 3500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే రిటైల్ మార్కెట్ లాజిస్టిక్స్ రంగంలో ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా హైదరాబాదులో ఒక భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
దుబాయ్ కేంద్రంగా పనిచేసే లులు గ్రూప్ హైదరాబాద్ లో హైపర్ మార్కెట్ ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటిగా అవతరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలంగాణలో దాదాపు 3500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ సందర్భంగా లులు గ్రూప్ పేర్కొంది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే రిటైల్ మార్కెట్ లాజిస్టిక్స్ రంగంలో ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే తాజాగా లు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో MOU కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తో కలిసి గతంలో దావోస్ లో ఏర్పాటుచేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పలు విషయాలను చర్చించినట్లు తెలిపారు. అప్పుడే ఈ ఎంఓయు కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు
మొదటి దశలో భాగంగా హైదరాబాదులో 500 కోట్ల పెట్టుబడితో లులు గ్రూప్ త్వరలోనే తన మొదటి ప్రాజెక్టును లాంచ్ చేయబోతోందని పేర్కొన్నారు. ఇందులో 300 కోట్ల రూపాయలతో ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ తో అతిపెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి మంజీరా షాపింగ్ మాల్ ను త్వరలోనే లులు షాపింగ్ మాల్ గా మార్చి హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ పంచనున్నట్లు పేర్కొన్నారు.
ఈ హైపర్ మార్కెట్లో మొత్తం 75 అంతర్జాతీయ బ్రాండ్లు అలాగే దేశీయ బ్రాండ్లు షాపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాంతోపాటు ఐదు స్క్రీన్ లతో మల్టీప్లెక్స్ థియేటర్ 1400 మంది కూర్చునేలా ఫుడ్ కోర్ట్ పిల్లలకు ఎంటర్టైన్మెంట్ సెంటర్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. కూకట్ పల్లిలో ఉన్నటువంటి ఈ మాల్ ప్రత్యక్షంగా 2000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు
అంతేకాదు దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసే ఈ హైపర్ మార్కెట్ అన్ని రకాల సరుకులను గృహోపకరణాలను అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్ మొబైల్స్, ఫ్యాషన్ సామాగ్రి అదే విధంగా బ్రాండెడ్ దుస్తులు అందుబాటులో ఉంచనున్నారు. వస్త్రాలు కాస్మోటిక్ కొనుగోలు చేసేందుకు లులు ఫ్యాషన్ స్టోర్ ను ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ సరుకుల కోసం లులు కనెక్ట్ పేరిట మరో షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టులో షాపింగ్ మాల్ ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరో రెండు వందల కోట్ల పెట్టుబడితో అతి త్వరలోనే చెంగిచెర్లలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేసేలా ఈ మీట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 60 టన్నులు మాంసం ప్రాసెసింగ్ చేసేలా యూనిట్ స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో సుమారు 2500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ యూనిట్ రాబోయే పద్దెనిమిది నెలల్లో అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు..
దీంతో పాటు రాబోయే ఐదు సంవత్సరాలు మొత్తం 3500 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రెండు వేల కోట్ల రూపాయలతో హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో మినీ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చర్ ఆధారంగా పనిచేసే లాజిస్టిక్ హబ్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత దేశంలోని కొచ్చి తిరువనంతపురం బెంగళూరు లక్నో కోయంబత్తూర్ అనంతరం తాము హైదరాబాదులో విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో 24 షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశామని, అందులో 250 హైపర్ మార్కెట్స్ ఉన్నాయని పేర్కొన్నారు ఇక ఫుడ్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే అహ్మదాబాద్ చెన్నై శ్రీనగర్ గ్రేటర్ నోయిడా వారణాసిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు తమ గ్రూపు మొత్తం 65 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోందని 42 దేశాల్లో తమ కార్యకలాపాలు ఉన్నాయని ఏటా ఎనిమిది బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధిస్తున్నామని ఈ సందర్భంగా నులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు.