నేడు నిలకడగా బంగారం, వెండి.. కొనేందుకు మంచి ఛాన్స్.. 22 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

By asianet news telugu  |  First Published Jun 26, 2023, 12:33 PM IST

భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటులో గమనించిన ధోరణులను నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
 


నేడు భారతదేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. జూన్ 26, 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,180 అయితే 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,250. దింతో నేడు  24 క్యారెట్లు, 22 క్యారెట్ల ధరలో ఎటువంటి మార్పులు నమోదు కాలేదు.

భారతదేశంలోని ముఖ్యమైన నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,330 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,400. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,180 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,250.

Latest Videos

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,180 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,250గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 59,510 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,550.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈరోజు కూడా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,180 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,250.

న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో వెండి (కిలోకి) ధర రూ.70,900, చెన్నైలో కిలో వెండి ధర రూ.75,200. 

భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటులో గమనించిన ధోరణులను నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

0538 GMT నాటికి స్పాట్ బంగారం 0.3% పెరిగి ఔన్సుకు $1,926.19కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.3% లాభపడి $1,936.00కి చేరుకుంది.

డాలర్ ఇండెక్స్ 0.2% తగ్గింది. స్పాట్ వెండి ఔన్స్‌కు 1.5% పెరిగి $22.75కి చేరుకోగా, ప్లాటినం 1.3% పెరిగి $928.74కి చేరుకుంది.

ఆటో-క్యాటలిస్ట్ మెటీరియల్ పల్లాడియం 0.8% పెరిగి $1,294.59కి చేరుకుంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధర  స్థిరంగా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ. 54,250 వద్ద, 24 క్యారెట్ల పసిడి  10 గ్రాముల ధర రూ. 59,180 వద్ద ట్రేడవుతోంది.  వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 74,500 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

 విజయవాడలో 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 గా ఉంది. 24 క్యారెట్ల విషయానికి వస్తే 10 గ్రాముల బంగారం ధర రూ. 59,280 గా ఉంది. వెండి  ధర కేజీకి రూ. 75,200. 

click me!