అనిల్‌ అంబానీపై ఫ్రాన్స్‌ పత్రిక సంచలనం: 143.7యూరోల పన్ను రద్దు

By rajesh yFirst Published Apr 13, 2019, 6:16 PM IST
Highlights

రఫేల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీపై తాజా ఫ్రాన్స్ పత్రిక కథనంతో మరో పిడుగు పడినట్లయింది. ఆయనకు చెందిన సంస్థకు 143.7మిలియన్ యూరోల పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచ్ జాతీయ దిన పత్రిక లీ మోండే తన కథనంలో వెల్లడించింది. 

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీపై తాజా ఫ్రాన్స్ పత్రిక కథనంతో మరో పిడుగు పడినట్లయింది. ఆయనకు చెందిన సంస్థకు 143.7మిలియన్ యూరోల(162.6మిలియన్ డాలర్లు) పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచ్ జాతీయ దిన పత్రిక లీ మోండే తన కథనంలో వెల్లడించింది. 

ఫ్రాన్స్‌లో ఉన్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అనే సంస్థకు చెందిన పన్నును ఫ్రాన్స్ రద్దు చేసిందని పేర్కొంది. అంతేగాక, భారత ప్రధాని నరేంద్ర మోడీ రఫేల్ యుద్ధ విమానాల  కొనుగోలు విషయమై ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న కొన్ని నెలలకే ఇది జరిగిందని తెలిపింది. 

2015 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఫ్రాన్స్‌ పర్యటకు వెళ్లారు. ఆ సమయంలో ఫ్రాన్స్‌తో 36 రఫేల్‌ జెట్ల గురించి ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆ  తర్వాత అదే ఏడాది అక్టోబరులో అనిల్‌ కంపెనీకి ఫ్రాన్స్ పన్ను మాఫీ చేసిందని ఆ పత్రిక పేర్కొంది.

2007 - 2010 మధ్య కాలంలో అంబానీ రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ కంపెనీ 60 మిలియన్ల యూరోలు పన్నులు చెల్లించకపోవడంతో.. అక్కడి పన్ను అధికారులు దర్యాప్తు  చేపట్టారు. 

అయితే 7.6 మిలియన్ యూరోలు చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. దీన్ని తిరస్కరించిన అధికారులు దర్యాప్తు చేపట్టారని.. కానీ ఈ వివాదానికి 2015లో ముగింపు పలికారని సదరు పత్రిక తెలిపింది. కాగా, ఈ పత్రిక కథనంపై అనిల్ అంబానీ లేదా ఆయన నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ స్పందించే అవకాశం ఉంది.

click me!