యూట్యూబ్: అమెరికాను దాటేసిన ఇండియా

By rajesh yFirst Published Apr 13, 2019, 5:11 PM IST
Highlights

ఇప్పటి వరకు యూ ట్యూబ్‌కు అమెరికాలోనే ఎక్కువ మంది వినియోగదారులుండేవారు. కానీ, ఇప్పుడు భారత్ అమెరికాను దాటేసింది. తాజాగా కామ్‌కోర్ ప్రకారం.. గూగుల్‌కు చెందిన యూ ట్యూబ్‌కు భారతదేశంలో నెలవారీగా 256 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు యూ ట్యూబ్‌కు అమెరికాలోనే ఎక్కువ మంది వినియోగదారులుండేవారు. కానీ, ఇప్పుడు భారత్ అమెరికాను దాటేసింది. తాజాగా కామ్‌కోర్ ప్రకారం.. గూగుల్‌కు చెందిన యూ ట్యూబ్‌కు భారతదేశంలో నెలవారీగా 256 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అమెరికాలో సుమారు 200 మిలియన్లకుపైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ బ్రాండ్‌క్యాస్ట్ సందర్భంగా ఆన్‌లైన్ ఈకోసిస్టమ్ పెరుగుదల, ఇది ఇండియాలో ఇంటర్నెట్ వృద్ధికి ఎలా సాయపడిందనే విషయాలను వెల్లడించింది. 

ప్రస్తుతం ఇండియా నుంచే మాకు పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ ఉన్నారు.. ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆడియెన్స్ సంఖ్య కూడా ఈ దేశం నుంచే ఉన్నారని యూట్యూబ్ సీఈఓ సుసన్ వోజిసికి తెలిపారు.

వినోదం కోసమైనా.. ఏదైనా సమాచారం కోసమైనా.. ఇంటర్నెట్ యూజర్లు మొట్టమొదటగా యూట్యూబ్‌నే సందర్శిస్తున్నారని ఆయన వెల్లడించారు. 
భిన్నమైన కంటెంట్ లభిస్తుండటంతో ఎక్కువమంది యూజర్లు యూట్యూబ్‌లో అధిక సమయం గడుపుతున్నారని తెలిపారు.

గత సంవత్సరం మొబైల్ యూట్యూబ్ వినియోగం 85శాతం పెరిగింది. భారతదేశంలోని ఆరు పెద్ద మెట్రో నగరాల నుంచి కాకుండా 60శాతం వీక్షణ సమయం పెరిగిందని ఆయన వెల్లడించారు. 

ఐదేళ్ల క్రితం మిలియన్ సబ్ స్క్రైబర్స్‌తో ఇద్దరు క్రియేటర్స్ ఉండగా.. ఇప్పుడు 1200 ఇండియన్ క్రియేటర్స్.. వన్ బిలియన్ సబ్ స్క్రైబర్ మైల్‌స్టోన్ దాటేశారని చెప్పారు. ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్స్ కారణంగానే ఇది సాధ్యమైందని వివరించారు.

click me!