ఐటీ రంగానికి ఇక మంచి రోజులు: టెక్కీల నియామకాల జోరు

By rajashekhar garrepallyFirst Published May 3, 2019, 10:05 AM IST
Highlights

రానున్న కాలంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా ఉద్యోగుల నియామకాలు జరుగుతాయని ఓ నివేదిక తేల్చింది. ఇప్పుడు అన్ని పరిశ్రమలు, సంస్థల్లో సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలు జోరందుకోనున్నాయని తెలిపింది. 

ముంబై: రానున్న కాలంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా ఉద్యోగుల నియామకాలు జరుగుతాయని ఓ నివేదిక తేల్చింది. ఇప్పుడు అన్ని పరిశ్రమలు, సంస్థల్లో సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలు జోరందుకోనున్నాయని తెలిపింది. 

ఈ ఏడాది(2019) ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోనే అధిక ఉద్యోగాలు లభిస్తాయని ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ షైన్‌ డాట్‌ కామ్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిపిన నియామకాలు, ఏడాది క్రితంతో పోల్చి, ఏయే రంగాల్లో అధిక వృద్ధి లభించనుందో ఈ సంస్థ అంచనా వేసింది.

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), విద్య, శిక్షణ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. భాషా నైపుణ్యం, రెస్టారెంట్లు, హోటళ్లలోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని షైన్‌ డాట్‌ కామ్‌ సీఈఓ జైరస్‌ మాస్టర్‌ తెలిపారు.

తయారీ, నిర్వహణ, సేవారంగాల్లో ఉద్యోగావకాశాలు అనూహ్యంగా పెరుగుతుండటంతో అగ్రశ్రేణి 10 రంగాల్లో మొదటిస్థానానికి చేరుతున్నాయని పేర్కొన్నారు. 

కొత్తతరం ఉద్యోగాల కోసం, నైపుణ్య పునఃశిక్షణపై దృష్టి కేంద్రీకృతమవుతోంది. ఈ రంగంలోనే చాలా అవకాశాలు కల్పిస్తోంది. ఇక వ్యాపార పొరుగు సేవలు (బీపీఓ)/కాల్‌ సెంటర్‌) పరిశ్రమ చాలా ప్రాంతాల్లో తగ్గిపోగా.. తయారీరంగం జోరు కొనసాగుతోందని పేర్కొన్నారు.

అత్యధిక వృత్తి నిపుణులకు మెట్రో నగరాలు అవకాశాలుంటున్నాయి. ఉద్యోగాలు కల్పించడంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ ముందున్నాయి. ఛండీగఢ్‌, జైపుర్‌ వంటి రెండో అంచె నగరాల్లోనూ ఉద్యోగావకాశాల్లో పెరుగుదల నమోదవుతోందని షైన్ నివేదిక వెల్లడించింది.

click me!