ఫెడ్ రేట్ల ఎఫెక్ట్: నాలుగేళ్ల గరిష్టానికి పసిడి డిమాండ్

By rajashekhar garrepallyFirst Published May 2, 2019, 4:00 PM IST
Highlights

వడ్డీరేట్లు పెంచబోమని ఫెడ్ రిజర్వు చైర్మన్ ప్రకటించడంతో పసిడి ట్రేడింగ్ పై పడింది. వారం రోజుల కనిష్టానికి పసిడి ధరలు పడిపోయాయి. మరోవైపు దేశీయంగా పసిడి పట్ల డిమాండ్ నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నది. 
 

ముంబై: ప్రపంచ మార్కెట్లో పసిడి ధర గురువారం వారం రోజుల కనిష్టానికి పతనమైంది. ఆసియా మార్కెట్లలో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 8.75 డాలర్లు నష్టపోయి 1,275.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ వడ్డీరేటు యథాతథంగా ఉంచడంతో పసిడిలో అమ్మకాల ధోరణి కనబడతోంది. ఇది దేశీయంగా కూడా ప్రభావితం  చేస్తోంది.

ద్రవ్యోల్బణం బలహీనంతో రేట్ల కోతకు ఫెడ్ నో
అమెరికా రిజర్వ్‌బ్యాంక్‌ పాలసీ సమీక్ష సందర్భంగా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ ‘ద్రవ్యోల్బణం బలహీనపడుతున్న నేపథ్యంలో రేట్ల కోతకు అవకాశం లేదు. కాబట్టి కీలక వడ్డీరేట్లను స్థిరంగా ఉంచుతున్నాం’ అని అన్నారు. అధిక వడ్డీరేట్లు.. డాలర్‌, ఈల్డ్స్‌ ర్యాలీకి సహకరించగా, పసిడి ధరకు ప్రతికూలంగా మారనున్నాయి.

ఆసియాలో ఫ్యూచర్ గోల్డ్ అమ్మకాలు ఇలా
ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆసియా మార్కెట్లో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా అంతర్గత ట్రేడింగ్‌లో ఒకానొక దశలో ఔన్స్ బంగారం ధర వారం రోజల కనిష్టానికి 1,273.85 స్థాయికి పతనమైంది. ఇక రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగియడంతో అక్కడ మార్కెట్లో పసిడి ధర 1,284.20 డాలర్ల వద్ద ముగిసింది. 

దేశీయంగా రూ.313 క్షీణించిన బంగారం ధర  
దేశీయంగానూ పసిడి ధర అమ్మకాల ఒత్తిడి లోనవుతోంది. ఎంసీక్స్‌ ట్రేడింగ్‌లో జూన్‌ ఫ్యూచర్‌ కాంటాక్టు 10 గ్రాముల పసిడి ధర రూ.313 నష్ట పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వారం రోజుల కనిష్టానికి చేరుకుని డాలర్‌ మారకంలో రూపాయి స్వల్పంగా బలపడటం ఇందుకు కారణవుతోంది.  హైదరాబాద్‌లో 24  కారెట్ల పుత్తడి ధర రూ. 50 క్షీణించి  రూ.31,963 వద్ద, 22 క్యారెట్ల ధర  రూ.30433 వద్ద ఉంది. 

క్షీణత నమోదైన వెండి ధర
ఎంసీఎక్స్‌ మార్కెట్లో వెండి ధరలు కూడా క్షీణతను నమోదు చేస్తున్నాయి.  కిలో వెండి రూ. 285 పతనమై రూ.36295 వద్ద కొనసాగుతోంది. ఇది ఇలా వుంటే  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో  గ్లోబల్‌గా బంగారానికి డిమాండ్‌ 7 శాతం పుంజుకుంది. దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్‌ ఏకంగా నాలుగేళ్ల గరిష్టానికి చేరడం విశేషం.

click me!